Connect with us

Entertainment

రాజకీయాల పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

Published

on

Share the News from here

విజయ్ దేవరకొండ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తన అభిమానులను రౌడీ బాయ్స్ అని పిలిచే విజయ్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే తనకు రాజకీయాలు చేసే ఓపిక లేదని, ప్రస్తుత రోజుల్లో రాజకీయ వ్యవస్థ అర్ధం పర్థం లేకుండా ఉందని అన్నాడు. అలాగే ఓటు వేసే హక్కు అందరికి ఇవ్వకూడదని అభిప్రాయపడ్డాడు. ఓటు హక్కు పేద వారికి, డబ్బు ఉన్న వారికి ఉండకూడదని అన్నాడు. కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని పేర్కొన్నాడు.

ముఖ్యంగా మందు కోసం ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదని తెలిపాడు. ఒక విమానం నడిపే పైలట్ ‌ను దాంట్లో ప్రయాణించే ప్రయాణికులు ఎన్నుకోరు కదా అని పేర్కొన్నాడు. అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను సమాజంపై అవగాహన ఉన్న వ్యక్తి చేతిలో పెట్టాలి. కానీ అందరికి ఓటు హక్కు కలిపించడం సరికాదని విజయ్ తెలిపాడు. ఇప్పుడు విజయ్ వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. ఇక ఆయన మాట్లాడిన మాటలకూ కొందరు విమర్శిస్తే, మరికొందరు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!