YS Jagan Mohan Reddy : కూల్ గాగుల్స్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్.! స్టైలింగ్ వైరల్.!

NQ Staff - August 26, 2022 / 01:18 PM IST

YS Jagan Mohan Reddy  : కూల్ గాగుల్స్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్.! స్టైలింగ్ వైరల్.!

YS Jagan Mohan Reddy  : రాజకీయ నాయకులు కాస్త కొత్తగా ఏం చేసినా, అది వైరల్ అవుతుంటుంది. అభిమానులు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుల స్టైలింగ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా వైసీపీ శ్రేణులు పిలుచుకునే వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టైలింగ్ గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. జస్ట్ ఫార్మల్స్‌లో ఆయన కన్పిస్తుంటారనుకోండి.. అది వేరే సంతి.

ఆ మధ్య దావోస్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్, కాస్తంత రిలాక్సేషన్ మోడ్‌లో జీన్స్ ధరించి కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది.

కూల్ గాగుల్స్.. లుక్ అదుర్స్..

Video Of YS Jagan Mohan Reddy Wearing Goggles

Video Of YS Jagan Mohan Reddy Wearing Goggles

తాజాగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణానికి.. అందునా, సముద్ర పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తున్న ప్లాస్టిక్ అంశంపై ఓ కార్యక్రమం జరిగింది. పార్లే సంస్థ, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి తయారు చేసిన గాగుల్స్‌ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ధరించారు.

అలా వైఎస్ జగన్ గాగుల్స్ ధరించినప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జగనన్న మాస్ అండ్ క్లాస్ స్టైలింగ్.. అంటూ వైసీపీ శ్రేణులు ఈ వీడియోని ట్రెండింగ్ చేస్తున్నాయి.

 

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us