Venu Swamy : పెట్టుడు ముహూర్తాలలో పిల్లల్నికంటే వారి జీవితం ఎలా ఉంటుందో చెప్పిన వేణు స్వామి
NQ Staff - July 19, 2022 / 02:05 PM IST

Venu Swamy : ఈ రోజుల్లో చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందుగా ముహూర్తాలు చూసుకుంటున్నారు. గృహప్రవేశాలు.. పెళ్లిళ్లు.. శుభాకార్యలు.. నూతన వ్యాపారాలకి ముహూర్తాలు పెట్టుకుంటున్నారంటే ఒకే. కాని గర్బిని స్త్రీ బిడ్డకు జన్మనిచ్చే ముందు ముహూర్తం చూసుకొని బిడ్డల ని కంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముహూర్తం పిచ్చిలో మరి కొందరు వారి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు..

Venu Swamy Reveals Shocking Facts About Child Birth
పెట్టుడు ముహూర్తంలో నిజెమంత?
కళ్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదు . అలానే జనన మరణాలు మన చేతిలో లేవు అని వాటికి ముహూర్తాలు ఉండవని పెద్దలు చెప్పేవారు.. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. మరణాల సంగతి ఏమోగాని.. జననాల విషయంలో మార్పు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో గర్భిణులు పెట్టుడు ముహూర్తాలతో సిజేరియన్ వైపు చూస్తున్నారు.

Venu Swamy Reveals Shocking Facts About Child Birth
పెట్టుడు ముహూర్తాలలో పిల్లల్ని కంటే చనిపోయే అవకాశం ఉందని వేణు స్వామి అన్నారు. సాధారణంగా నక్షత్రం చూసి అశ్విని, రేవతి, శ్రవణి నక్షత్రం బాగుందని అంటాడు. కాని పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది. పుట్టుకకు ప్రధాన కారణం లగ్నం. దానిని బట్టే మన జీవితం నడుస్తుంది. లగ్నం చూడకుండా మంచి నక్షత్రంలో ముహూర్తం పెట్టినట్టయితే ఆడిజం వస్తుంది.
డెలివరీ మనకు నచ్చిన టైంలో మనకు నచ్చినట్టు చేసుకోంచ్చా అనే దానిపై స్పందించిన వేణు స్వామి అలాంటిది అస్సలు జరగదు. అంతా దేవుని చేతుల్లో ఉంటుంది. మనం ముహూర్తం పెట్టమన్న క్షణానికి జ్యోతిష్కుడు మంచి మూడ్ లేకనో, మనం పెట్టిన ముహూర్తానికి డాక్టర్స్ బిజీ అయ్యో మొత్తం మీద చక్రం తిప్పేది దేవుడే. పెట్టుడు ముహూర్తంలో అంత ప్రభావం ఉంటే అందరు సూపర్ స్టార్స్ కావాలి కదా అని ఆయన అన్నారు.