జిహెచ్ఎంసి ఎన్నికల కోసం మరొక అడుగు ముందుకేసిన బీజేపీ.
Admin - November 26, 2020 / 06:26 PM IST

జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మేనిఫెస్టో విడుదల చేసారు. ఇక ఈ మేనిఫెస్టోలో పేదలకు పెద్ద పీఠ వేసాడు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద సాయంగా ఇరువై ఐదు వేల రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలో LRS ను రద్దు చేస్తామని, దీనిద్వారా ఎంతో మంది పేదలకు విముక్తి లభిస్తుందని చెప్పుకొచ్చాడు. నగరంలో కరోనా వ్యాక్సిన్ అందిస్తామని, టెస్టుల సంఖ్య కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ నగరంలోని మెట్రో, ఆర్టీసీ లో ప్రయాణించే మహిళలకు ఉచిత ట్రావెలింగ్ అందిస్తామని, అలాగే మరికొన్ని హామీలను కూడా వెల్లడించాడు.