Telangana MLC Elections : తప్పక చూడండి.. ఈ వీడియో.. మీ కోసం..

Telangana MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14వ తేదీన అంటే వచ్చే ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ ఓటింగ్ ని రెండు పట్టభద్ర నియోజక వర్గాల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొత్తం ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక సెగ్మెంట్ పరిధిలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాలు ఉండగా మరో సెగ్మెంట్ పరిధిలో ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాలు ఉన్నాయి.

లక్షల్లో..

ఈ రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య పది లక్షల పైనే ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారి సంఖ్య సైతం 150 దాటింది. ఇందులో దాదాపు సగం మంది డిగ్రీ హోల్డర్లు కొత్తగా తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకున్నారు. వాళ్లు ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ఎన్నికల సంఘంతోపాటు వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఓటరుగా పేరు నమోదుచేసుకున్నవాళ్లందరూ ఉన్నత విద్య అభ్యసించినవాళ్లే. కాబట్టి వాళ్లకు పోలింగ్ పై కొద్దోగొప్పో అవగాహన ఉండి ఉంటుంది.

అయినా: Telangana MLC Elections

మెజారిటీ పట్టభద్రులు గతంలో ఇతర ఎన్నికల్లో ఓటేసే ఉంటారు. అతికొద్ది మందికి ఇదే మొదటిసారి పోలింగ్ అయుండొచ్చు. అయినప్పటికీ ఈ శాసన మండలి ఎన్నికల్లో ఓటేయబోయే ప్రతిఒక్కరికీ ఈ ప్రక్రియపై అవగాహన కల్పించటం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఒక ప్రత్యేక వీడియోను రూపొందించి విడుదల చేసింది. ఓటింగ్ కి సంబంధించిన దాదాపు అన్ని వివరాలూ ఇందులో ఉన్నాయి. కాబట్టి అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది.

Telangana MLC Elections : special video released by election commission of india for telangana mlc voters
Telangana MLC Elections : special video released by election commission of india for telangana mlc voters

ఆ ఓటర్ కార్డేనా?..

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి కూడా పాత ఓటర్ కార్డు తీసుకెళ్లొచ్చా? లేక కొత్తది తీసుకోవాలా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటివాళ్లు ఈ వీడియోని చూస్తే సరిపోతుంది. ఓటర్ల లిస్టులో పేరు నమోదై ఉండి ఓటర్ కార్డు లేకపోయినా ఏయే కార్డులు తీసుకెళ్లొచ్చో కూడా ఇందులో వివరించారు. ఓటర్ స్లిప్పులు, ఓటింగ్ టైమ్, పోలింగ్ కేంద్రం తదితర సమాచారాన్ని ఈ స్పెషల్ వీడియోలో పొందుపరిచారు.

Advertisement
Advertisement