ఎల్లలు దాటిన అభిమానం. బేగంపేట్ లోని తన అభిమాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోనూసూద్ !
Admin - December 26, 2020 / 12:32 PM IST

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ను అభిమానించని వారంటూ ఎవ్వరు ఉండరు. కరోనా కష్టకాలం నుండి ఇప్పటివరకు ఎంతోమందికి సహాయసహకారాలు అందజేస్తూ రియల్ హీరోగా నిలిచిపోతున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో అన్ని ప్రాంతాల్లో తనను అభిమానిస్తున్నారని చెప్పాలి. ఇదిలా ఉంటె తాజాగా హైదరాబాద్ లో ప్రతిక్షం అయ్యాడు సోను. అయితే బేగంపేట్ లోని అనిల్ అనే వ్యక్తి సోనూసూద్ చేస్తున్న మంచి పనులకు తాను నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు ‘ సోనూసూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ‘ గా నామకరణం చేశాడు. ఇక ఈ మాట ఆ నోట ఈ నోట సోను వరకు వెళ్ళింది.
దీనితో సోనూసూద్ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను సందర్శించి సందడి చేశాడు. ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి, గరిటె పట్టి ఫాస్ట్ ఫుడ్ కూడా చేశాడు. ఇక సోను తమ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను సందర్శించడంతో నిర్వాహకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే సోనూసూద్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని సోనూసూద్ ను చూసి మురిసిపోయారు. నిజంగా సోనూసూద్ చేస్తున్న సేవలకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే..! కాగా.. సోను ప్రస్తుతం తెలుగులో ‘ అల్లుడు అదుర్స్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.