Rama Rao On Duty : ర‌సాభాస‌గా మారిన రామారావు ట్రైల‌ర్ ఈవెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు

NQ Staff - July 17, 2022 / 03:41 PM IST

Rama Rao On Duty  : ర‌సాభాస‌గా మారిన రామారావు ట్రైల‌ర్ ఈవెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు

Rama Rao On Duty  : ఈ మ‌ధ్య కాలంలో ప‌లు సినిమాల‌కు సంబంధించిన ఈవెంట్స్ ఎంత ర‌సాభాస‌గా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. నిర్వాహ‌కులు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా కార్య‌క్ర‌మాన్ని ఆర్గ‌నైజ్ చేస్తున్న నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మం అంతా ఫ్లాప్ అవుతుంది. అయితే తాజాగా జ‌రిగిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ట్రైల‌ర్ ఈవెంట్‌లో నిర్వాహ‌కులు కాస్త అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో ఈవెంట్ అంతా ర‌చ్చ ర‌చ్చ అయింది.

ప్రోగ్రాం ఫ్లాప్..

రవితేజ నటించిన రామారావుః ఆన్‌ డ్యూటీ` మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ని శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్‌లో నిర్వహించారు. అయితే ఈవెంట్‌కి సంబంధించిన సమాచారం ఈవెంట్‌ మేనేజింగ్‌ సంస్థ రెండు రోజుల ముందు నుంచే సోషల్‌ మీడియాలో పెట్టింది. టైమ్‌, ప్లేస్‌తో సహా నెటిజన్లతో పంచుకున్నారు.అంతేకాదు పాస్‌లు కూడా జారీ చేశారట.

Rama Rao On Duty Trailer Event

Rama Rao On Duty Trailer Event

ఇక ఈవెంట్ కోసం ర‌వితేజ అభిమానులు భారీగా హోట‌ల్‌కి త‌ర‌లి వ‌చ్చారు. అంత‌ మందిని చూసి హోటల్‌ సెక్యూరిటీ అభిమానులను లోపలికి అనుమతించలేదు. అభిమానులు ఎంత బ్రతిమాలుకున్నా నిర్వహకులు కొంత మందినే అనుమతించగా, చాలా మంది బయటే ఉండిపోయారు. దీంతో ఆగ్రహించిన ఫ్యాన్స్‌ దాడికి దిగారు. భారీగా ఫ్యాన్స్‌ రావడంతో వారిని కంట్రోల్‌ చేయడం నిర్వహకులకు సాధ్యం కాలేదు.

పోలీసులు కూడా రంగంలోకి దిగి వారి చెద‌ర‌ గొట్టిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్‌లో ఫ్యాన్స్ రచ్చ చేశారు. అరుపులు, గోలలతో హోరెత్తించారు. ఈవెంట్‌ మొత్తం గందర గోళంగా మార‌డంతో ర‌వితేజ కూడా ఏదో పైపైన మాట్లాడి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిర్వహకులు ప్రదర్శించిన అత్యుత్సాహం కారణంగా రవితేజ ఫ్యాన్స్ తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చిందని అంటున్నారు.

 

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us