” చెక్ మెట్ ” సినిమాతో నేను చాలా నేర్చుకున్నా..! : యాంకర్ విష్ణుప్రియ

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ తన యాంకరింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. ఇక ఇన్ని రోజులు బుల్లితెర మీద సందడి చేసిన ఆమె త్వరలో వెండితెర పైన కనిపించబోతున్నారు. ఆమె ప్రస్తుతం ‘ చెక్ మెట్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ కు మంచి స్పందన కూడా లభిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా ఈ చిత్రానికి సంబందించిన పలు విషయాలను విష్ణుప్రియ పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. యాంకరింగ్ రంగంలోకి రాకముందే తీసిన చిత్రమని చెప్పుకొచ్చింది. ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నానని పేర్కొంది. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందుతుందని వెల్లడించింది.

 

 

Advertisement