కాంగ్రెస్ పార్టీ ప్రతిఒక్కరికి ఎల్లప్పుడు అండగా ఉంటది : ఎంపీ రేవంత్ రెడ్డి
Admin - December 8, 2020 / 05:42 PM IST

జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నుండి పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్క నాయకుడికి అండగా ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్నికల ప్రచారంలో అంతమంది కనిపించిన తీరా పోలింగ్ సెంటర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఎవ్వరు ఉపయోగించుకోలేదని అన్నారు. ఓటమి చెందిన.. పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్కరికి అండగా ఉంటామని రేవంత్ రెడ్డి వెల్లడించాడు.