సినీ పరిశ్రమకు అండగా ఉంటాం : సీఎం కెసిఆర్
Admin - November 23, 2020 / 06:17 PM IST

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో సీఎం కెసిఆర్ మేనిఫెస్టో ను విడుదల చేసాడు. ఇక ఈ మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు వరాలు కురిపించారు. ఇక ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని ఆపదలో ఉన్న పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు. సుమారుగా సినీ పరిశ్రమ మీద ఆధారపడిన 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారందరికీ అండగా ఉంటామని చెప్పుకొచ్చాడు. చిన్న సినిమాలు తీసే వారికీ కూడా అండగా నిలుస్తామని పేర్కొన్నాడు. త్వరలో థియేటర్లు కూడా తెరుచుకోవచ్చని కెసిఆర్ వెల్లడించాడు.