బాబు గారికి చుక్కలు చూపిస్తున్న జగన్. ఆగమాగం జగన్నాధం
Admin - November 30, 2020 / 06:34 PM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే హాట్ టాపిక్ గా మారాయి. సభలో భాగంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కు చుక్కలు చూపించారు. అయితే సభలో తమకు మైక్ ఇవ్వలేదని గందరగోళం చేసారు బాబు గారు. దీనితో జగన్ చంద్రబాబు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ఒకవైపు రాష్ట్రంలో తుపాన్ వచ్చి ప్రజలందరూ సర్కార్ ఏం చేబుతుందా అని ఎదురు చూస్తుంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఎప్పుడు చుసిన గుడ్లు పెద్దగా చేస్తూ భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు తప్ప ఏనాడు సామరశ్యంగా మాట్లాడిన దఫాలు లేవని జగన్ విమర్శలు చేసాడు.