తనకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టిన బీజేపీ అభ్యర్థి
Admin - December 9, 2020 / 05:46 PM IST

జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఒక్క నేరడమేట్ డివిజన్ ఫలితాల లెక్కింపు ఆగిపోయింది. అయితే ఈ డివిజన్ లో చాలా వరకు ఓట్లు పాడయ్యాయి. దీనితో ఈ సమస్య కోర్టుకు వెళ్ళింది. ఇక ఎట్టకేలకు నెరేడమెట్ ఫలితాలు కూడా వచ్చేసాయి. ఇక ఈ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి మీద టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందింది. దీనితో ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి కన్నీరుమున్నీరయ్యారు. తనకు అన్యాయం జరిగిందని, పాడైన ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లలో ఎలా కలుపుతారని మండిపడ్డారు. తాను ఓట్ల కోసం ఎంతో కష్టపడ్డానని చివరకు అన్యాయం జరిగిందని వాపోయారు. న్యాయం కోసం ఢిల్లీకి పోవడానికైనా సిద్ధంగా ఉన్నానని ఫైర్ అయింది.