Viral Video : బాబోయ్‌… బైక్ పై అంత పెద్ద ఎద్దును ఎలారా బాబు?

NQ Staff - September 14, 2022 / 05:10 PM IST

Viral Video : బాబోయ్‌… బైక్ పై అంత పెద్ద ఎద్దును ఎలారా బాబు?

Viral Video  : సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలు మ్యాటర్ ఏం లేకున్నా వైరల్ అవుతుంటే.. కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యంతో కలిగిస్తూ ఉంటాయి.

తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో

A video of Man Riding Bike with Bull On Back Seat

A video of Man Riding Bike with Bull On Back Seat

వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరచుతోంది. సాధారణంగా కుక్క పిల్లను బండిపై తీసుకు పోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక మేకా లేదా గొర్రె వంటి కాస్త పెద్ద జంతువులను బైక్ పై తీసుకు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మనం భావిస్తూ ఉంటాం.

ఏదైనా జంతువును ఒక్కళ్ళు దాన్ని తీసుకు వెళ్లాలంటే సాధ్యమయ్యే పనే కాదు.. కానీ ఏకంగా ఒక వ్యక్తి ఎద్దుని తాళ్లతో కట్టి వెనుక సీట్ల కూర్చోబెట్టుకొని బైక్ నడుపుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఇది నిజమైన వీడియో నేనా అని అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. బైక్ పై ఫుల్ స్పీడ్ తో వెనకాల ఎద్దును కట్టేసుకొని వెళ్తున్న ఒక వ్యక్తి ని చూసి ఇది ఎలా సాధ్యమంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు.

అసలు ఇది నిజంగా జరిగిందా లేదంటే గ్రాఫిక్స్ అయి ఉంటుందనేది కొందరు అనుమానా వ్యక్తం చేస్తున్నారు.. కానీ విజువల్స్ క్లియర్ గా ఉన్నాయి కనుక అతడు నిజంగానే ఎద్దును బైక్ పై కట్టేసుకుని తీసుకెళ్తున్నట్లుగా కొంతమంది చెప్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యమో అతడే చెప్పాలి.

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us