Extra Jabardasth : ఇమ్మూ కాదన్న రోజు తన ఊపిరి ఉండదు అంటూ ఎమోషన్ కామెంట్స్ చేసిన వర్ష
NQ Staff - August 11, 2022 / 11:01 AM IST

లవ్ ట్రాక్..
సుధీర్ – రష్మీ లవ్ ట్రాక్‌తో పాటు జబర్ధస్త్‌లో మరి కొన్ని లవ్ ట్రాక్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. వర్ష-ఇమ్మాన్యుయెల్, రాకేష్-సుజాత ఫేమస్ లవ్ ట్రాకులుగా చెప్పుకోవచ్చు. వర్ష, ఇమ్మాన్యుయెల్ లవ్ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వీరిద్దరు కలిసి చేసే స్కిట్లలో ఏదో రూపంలో తమ ప్రేమని వ్యక్తం చేసేలా స్కిట్లు రూపొందిస్తుంటారు.

Extra Jabardasth Latest Promo
తాజాగా `జబర్దస్త్` వేదికగా తమ ప్రేమని, తమ మధ్య ఉన్న బంధాన్ని బహిర్గతం చేశారు. గతంలో మాదిరిగానే `ఇమ్మూ లేకపోతే కష్టం మేడమ్` అన్నట్టుగానే మరోసారి ఆయనపై తన ప్రేమని వ్యక్తం చేసింది వర్ష. ఆయన లేకపోతే తాను బతకలేనని తెలిపింది. ` ఎక్స్ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో నరేష్‌తో కలిసి రష్మి డాన్సు చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇక `యమలోకం` స్కిట్ చేయగా, ఇందులో రాంప్రసాద్, గెటప్ శ్రీను, ఇమ్మాన్యుయెల్, వర్ష, ఫైమా, రాకేష్, సుజాతలు పార్టిసిపేట్ చేశారు. వీరిలో గెటప్ శ్రీను యముడిగా చేయగా, రాంప్రసాద్ ఆయన సహాయకుడిగా చేశారు. రాకేష్, సుజాత, ఇమ్మూ, వర్ష, ఇలా వారంతా కింద తప్పులు చేసి చనిపోయి యమలోకానికి వస్తారు. అక్కడ యమధర్మరాజు వారికి శిక్షలు వేయాలని నిర్ణయిస్తాడు.
ఈ క్రమంలో వర్ష, ఇమ్మాన్యుయెల్ జంటని విచారిస్తుంటారు. వీరిద్దరితో చాలా డేంజర్ అని చెప్పగా, అవును చూస్తుంటే వీరి చాలా డేంజర్‌గానే అనిపిస్తుందని గెటప్ శ్రీను చెప్పడంతో నవ్వులు విరిసాయి. అయితే వీరు శిక్ష నుంచి విముక్తి కావాలంటే తమ మధ్య ఉన్న ప్రేమ నిజమైనదని నిరూపించుకోవాలనే టాస్క్ ఇస్తారు. ఇదే అదనుగా భావించిన వర్ష రెచ్చిపోయింది.
వర్ష ఇమ్మాన్యుయెల్‌ని ఉద్దేశించి చెబుతూ, `ఇమ్మూ అందరికి డౌట్ ఉంది. ఏంటీ వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా? అని, అందరికి చెప్పాల్సిందేంటంటే ఇమ్మూ కాదన్న రోజు, ఈ వర్ష ఊపిరి ఉండదు` అని ఎమోషనల్‌గా చెప్పేసింది వర్ష. దీంతో ఇమ్మాన్యుయెల్లో పట్టలేని ఆనందంతో కూడిన నవ్వు విరిసింది. ఉబితబ్బిబ్బయ్యాడు. వర్ష సైతం ఆనందంతో ఉప్పొంగిపోయింది.