Surekha Vani: కూతురితో కలిసి ఏమా చిందులు.. కచ్చా బాదం పాటకి పిచ్చి లేపుతున్నారుగా..!
NQ Staff - February 14, 2022 / 11:53 AM IST

Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్స్‌లో చాలా క్యూట్‌గా ఉండే ఆర్టిస్ట్ సురేఖా వాణి. ఒకప్పుడు ఆమె లేని సినిమా ఉండేది కాదు. భర్త మరణం తర్వాత ఈవిడ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. ముఖ్యంగా కూతురితో కలిసి సురేఖా చేసే సందడి మామలుగా లేదు. తల్లి సురేఖావాణితో కలిసి సుప్రిత చిందేయడం కొత్తేమీ కాదులే గానీ వీళ్లిద్దరూ కాలు కదిపారంటే అందులో ఏదో మ్యాజిక్ అయితే ఉండే ఉంటుంది.

Artist Surekha Vani dancing with her daughter for Kacha Badam Song
లుంగీ కట్టి రంగంలోకి దిగినా, సాంప్రదాయ దుస్తుల్లో డాన్సులేసినా, మోడ్రన్ కల్చర్ టచప్ చేసినా వీళ్లిద్దరి జోడీకి వంక పెట్టడం ఎవ్వరితరం కాదు. అదేవిధంగా వీళ్ల డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయో, వాటికి ఎంత డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలుసు.

Artist Surekha Vani dancing with her daughter for Kacha Badam Song
తాజాగా ఫేమస్ కచ్చా బాదం సాంగ్‌కి సురేఖా, సుప్రిత చిందులేశారు. తమదైన స్టైల్‌లో వీరు చేసిన డ్యాన్స్‌లకు నెటిజన్స్ నుండి క్యూట్ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సుప్రిత షేర్ చేసిన వీడియోకిలైకులు, కామెంట్ల వర్షంకురుస్తుంది. వారిద్దరి పర్‌ఫార్మెన్స్‌కి ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.
తల్లీ కూతుళ్లే అయినా ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఒకరి కోసం బ్రతుకుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సురేఖావాణి- సుప్రిత. తన భర్త సురేష్ తేజ మరణించాక కూతురే సర్వస్వంగా ఉంటూ లైఫ్ లీడ్ చేస్తోంది సురేఖావాణి. పబ్బుకెళ్ళినా, షికార్లు కొట్టినా, ఫంక్షన్స్ చుట్టేసినా సురేఖావాణి వెంట తప్పనిసరిగా కూతురు సుప్రిత ఉండాల్సిందే. ఇప్పటికే ఈ ఇద్దరికీ సంబంధించిన ఎన్నో డాన్స్ వీడియోలు వైరల్ కాగా.. తాజాగా అంతకుమించి అనేలా మరో డాన్స్ వీడియో వదిలింది సుప్రిత.
సోషల్ మీడియాలో ఇప్పుడు కచా బాదం సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధిన వీడియోస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కచా బాదం పాటకు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యి తమ స్టైల్లో స్టె్ప్పులేస్తున్నారు. ఇప్పటికే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ, అనుపమ, ప్రియా ప్రకాశ్, పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా చిందులేశారు.