Balakrishna : బాలయ్యని చూసి విజిల్ వేసిన ముసలావిడ.. ఫ్యాన్ మూమెంట్ అద్దిరిపోలా..!
NQ Staff - July 26, 2022 / 03:59 PM IST

Balakrishna : నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయస్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన బాలకృష్ణ అశేష ప్రేక్షకాదరణ పొందాడు . అతనికి చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
దటీజ్ బాలయ్య..

An Old woman whistled And Expressed Admiration for Balakrishna
ప్రస్తుతం ఎన్‌బీకే 107 షూటింగ్ లో పాల్గొంటున్న బాలకృష్ణ.. ఇందులో భాగంగా సోమవారం నాడు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడి జనసందోహానికి సంబంధించిన కొన్ని వీడియోస్ బాలయ్య క్రేజ్ ఏంటనేది రుజువు చేస్తున్నాయి. బాలయ్య బాబు వస్తున్నాడని తెలిసి చిన్న పెద్దా అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున అక్కడికి జనం చేరుకున్నారు.
అందులో ఓ ముసలావిడ ఈలలు వేస్తూ బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకుంది. దీంతో ఈ వీడియోను బాలయ్య అభిమానులకు నో ఏజ్ లిమిట్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇంకేముంది ఈ వీడియో క్లిప్ నెట్టింట వెంటనే వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవలే టర్కీలో ఓ షెడ్యూల్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ఈ సినిమా కథ రాసుకున్నారట గోపీచంద్ మలినేని. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
No Age Limit For Fanism 🔥#NBK107 🦁 pic.twitter.com/DwoCZOVWKW
— 𝐑𝐚𝐯𝐢_𝐑𝐨𝐜𝐤𝐳𝐳_𝐍𝐓𝐑 ™ ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@RavirockzNTR) July 25, 2022