Connect with us

Entertainment

ట్రోల్స్ తో తమన్ ను ఆడుకుంటున్న నెటిజన్స్ , కాపీ చేయడం ఆపవా!

Published

on

Thaman
Share the News from here

మ్యూజిక్ దర్శకుడు తమన్ గత కొన్ని సంవత్సరాల నుండో ఎన్ని హిట్ ఆల్బమ్స్ తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. సంక్రాంతికి విడుదల అలా వైకుంఠపురం మూవీని మ్యూజికల్ హిట్ గా తమన్ నిలిపారు. ఈ మూవీలో సాంగ్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ను సృష్టిస్తున్నాయి. గతంలో కూడా తమన్ చేసిన సాంగ్స్ కూడా చాలా రికార్డ్స్ సృష్టించాయి. తమన్ కు హిట్స్ ఉన్నాయి. కానీ తమన్ పై మొదటి నుండి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

తమన్ ట్యూన్స్ ను వేరే మూవీస్ నుండి కాపీ కొడతాడాని, కాపీ క్యాట్ అని మొదటి నుండి వస్తున్న విమర్శలు. అయితే ఇప్పటికే తమన్ కాపీ క్యాట్ అనే వీడియోస్ యూట్యూబ్ లో, మీమ్ పేజెస్ లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ‘V’ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయినప్పుడే తమన్ పై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. V లో ఉన్న థీమ్ మ్యూజిక్ ను తమిళ్ మూవీ రాట్ససన్ మూవీ నుండి కాపీ చేసారని, అలాగే అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా చేసిన జయహో థీమ్ మ్యూజిక్ ను కూడా కాపీ చేశారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇలా కాపీ ట్యూన్స్ చేయడం తమన్ కు అలవాటా లేక తనకు తెలియకుండా జరుగుతుందా అనేది ఎవరికి అర్ధం కానీ పజిల్. V మూవీ విడుదల తరువాత తమన్ పై ట్రోలింగ్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ ట్రోలింగ్ పై తమన్ స్పందిస్తాడొ లేదో వేచి చూడాలి.

Do NOT follow this link or you will be banned from the site!