Connect with us

Entertainment

ఐపీఎల్ : కేదారి జాదవ్ వల్లే చెన్నై ఓడిపోయింది, జాదవ్ పై నెటిజన్లు ట్రోల్స్

Published

on

Share the News from here

ఐపీఎల్ 2020 సీజన్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య పోరుజరిగింది. ఇక ఈ పోరులో చెన్నై జట్టు ఓటమి చెందింది. అయితే అభిమానుల్లో ఎక్కువగా చెన్నై జట్టు ఫేవరేట్ గా ఉంటుంది. ఇక ఈ తరుణంలో చెన్నై వరుస పరాజయాలు మూటగట్టుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ లో చెన్నై ఓటమికి గల కారణం కేదారి జాదవెనని అతడిపై తెగ విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.

అయితే స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ కు దిగిన జాదవ్ 12 బంతుల్లో 7 పరుగులు చేసాడు. ఇక చెన్నై విజయానికి చివరి 21 బంతుల్లో 39 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి దిగాడు జాదవ్. జాదవ్ తన పరుగుల ఖాతాను తెరవాడనికి ఆరు బంతులు మింగాడు. ఆ తరువాతి ఓవర్ లో మొదటి మూడు బంతుల్నీ డిఫెన్స్‌ తో సరిపెట్టాడు. ఇక ఆ తరువాత రసెల్ ఓవర్ ‌లో బంతిని టచ్ చేయడనికి కూడా ఇబ్బంది పడ్డాడు.దీనితో చెన్నై జట్టుకు 12 బంతుల్లో 36 పరుగులు కావాల్సి ఉంది.

ఇక చివరి రెండు ఓవర్లలో ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసాడు. ఇక రవీంద్ర జడేజా 8 బంతుల్లో 21 పరుగులు చేసి హిట్టింగ్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఒకవైపు చెన్నై అభిమానులు జాదవ్ పై మండిపడుతున్నారు. జాదవ్ కనీసం రెండు బారి షాట్లు ఆడిన చెన్నై జట్టు గెలిచేదని అభిప్రాయ పడుతున్నారు. జాదవ్ పై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!