Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని మంచుకొండలు ఎక్కేసాడు.!

NQ Staff - September 21, 2022 / 04:48 PM IST

159922Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని మంచుకొండలు ఎక్కేసాడు.!

Pawan Kalyan: మహబూబాబాద్ కుర్రాడు మంచు కొండల్ని అధిరోహించేశాడు.! జస్ట్ అతని వయసు పద్ధెనిమిదేళ్ళు మాత్రమే. తెలంగాణలోని మహబూబాబాద్‌కి చెందిన బూక్యా యశ్వంత్ అనే కుర్రాడు రష్యా మరియు యూరోప్‌లోని అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్‌బ్రస్ అనే శిఖరాన్ని అధిరోహించాడు.

Yashwanth Showed Picture Of Pawan Kalyan On Snow Hills

Yashwanth Showed Picture Of Pawan Kalyan On Snow Hills

 

సాధారణ పర్వాతలు వేరు, మంచు కొండలు వేరు. అత్యంత క్లిష్టతరమైన వాతావరణ పరిస్థితులుంటాయ్. అనూహ్యంగా వాతావరణం ప్రమాదకరమైన రీతిలోకి మారిపోతుంటుంది. సంకల్ప బలంతో ముందడుగు వేశాడు. సెప్టెంబర్ 9న హైద్రాబాద్ నుంచి బయల్దేరి, సెప్టెంబర్ 10న రష్యా చేరుకున్నాడు యశ్వంత్. ఆ మరుసటి రోజే ట్రెక్కింగ్ మొదలు పెట్టాడు.

పవన్ కళ్యాణ్ ఫొటోతో..

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఆ మంచు కొండలపైన పవన్ కళ్యాణ్ ఫొటోని ప్రదర్శించాడు యశ్వంత్. అలాగే జాతీయ జెండాని కూడా రెపరెపలాడించాడు. గతంలో కిలిమంజారో తదితర శిఖరాల్ని అధిరోహించాడు యశ్వంత్.

Yashwanth Showed Picture Of Pawan Kalyan On Snow Hills

Yashwanth Showed Picture Of Pawan Kalyan On Snow Hills

యశ్వంత్ తండ్రి రామమూర్తి ఎన్‌పిడిసిఎల్ కాంట్రాక్టర్. అర్జెంటీనాలోని మౌంట్ అకోన్‌కాగువా పర్వత శిఖరాన్ని అధిరోహించాలని వుందనీ, ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాననీ యశ్వంత్ చెప్పాడు. చిన్నప్పటినుంచీ కొండలు ఎక్కడమంటే ఇష్టమనీ, తమ ఊరి పక్కనే వున్న కొండల్ని అవలీలగా చిన్నప్పుడే ఎక్కేశానని యశ్వంత్ వివరించాడు.