Nude Videos : ప్రియుడితో కలిసి కుట్ర: అత్తమామల నగ్న వీడియోలు తీసిన కోడలు.!

NQ Staff - September 20, 2022 / 05:52 PM IST

159734Nude Videos  : ప్రియుడితో కలిసి కుట్ర: అత్తమామల నగ్న వీడియోలు తీసిన కోడలు.!

Nude Videos : పోలా.! అదిరిపోలా.! అత్త మామల నగ్న వీడియోలట.! ఎటు పోతోంది కాలం. కలికాలం. ప్రియుడితో కలిసి తల్లి తండ్రుల్లాంటి అత్త మామల నగ్న వీడియోలు తీసిన దారుణ ఉదంతమిది. ఇంతకీ ఎక్కడ జరిగిందీ విచిత్రమైన ఘటన అంటే, దేశ రాజధాని ఢిల్లీలో.

ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆభరణాల వ్యక్తికి, గత నాలుగేళ్లుగా తన భార్యతో విబేధాలున్నాయ్. నిత్యం గొడవల కారణంగా ఆ భార్యా భర్తలిరువురూ దూరంగా వుంటున్నారు. దూరంగా అంటే, ఎక్కడెక్కడో కాదు, ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో.

ఎంత గొప్ప కోడలివమ్మా.!

 woman who Nude Videos of Aunt And Uncle with Boyfriend

woman who Nude Videos of Aunt And Uncle with Boyfriend

కట్ చేస్తే, భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం వున్నట్లు ఇటీవలే ఆ భర్త గుర్తించాడు. ఆయన మరెవరో కాదు, సదరు వ్యక్తికి స్వయానా స్నేహితుడే. బండారం బయట పడడంతో ఇంట్లోని కోటికి పైగా విలువ చేసే నగలూ, మరికొంత డబ్బుతో ఆ భార్య ప్రియుడితో కలిసి పారిపోయింది.

విషయం తెలుసుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నుంచీ భర్తకు పోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టింది ఆ భార్య. ఏమని అంటారా.? మహాశయా.! ఇంట్లో తన సొంత అత్తమామల గదిలో సీసీ కెమెరాలు పెట్టాననీ, వారి నగ్న చిత్రాలూ, వీడియోలూ తన వద్ద వున్నాయనీ, తనపై పెట్టిన కేసు వాపస్ తీసుకోకపోతే, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తాననీ బెదిరించింది. అదీ యవ్వారం. ఈ యవ్వారంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.