Sperm: తన వీర్యాన్ని ఉపయోగించి మహిళల్ని గర్భవతుల్ని చేసిన డాక్టర్

Sperm: డాక్టర్ అంటే దేవుడితో సమానం. ఈ ప్రపంచంలో డాక్టర్ కి ఉన్నంత గౌరవం మరే వృత్తిలోనూ ఉండదు. అందులోనూ మరో తరాన్ని సమాజానికి అందించే గైనకాలజీ వృత్తి ఇంకా పవిత్రమైంది. ఎంతో నమ్మకంతో తమ దగ్గరకు ట్రీట్ మెంట్ కోసం వచ్చిన మహిళల్ని అంతే పవిత్రంగా చూడాలి. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉన్న ఓ డాక్టర్ ఘోరాన్ని తలపెట్టాడు.

Woman Accuses Fertility Doctor Secretly Using Own Sperm
Woman Accuses Fertility Doctor Secretly Using Own Sperm

గర్భవతిని చేసేందుకు ఓ ఫెర్టిలిటీ డాక్టర్ దాతల నుండి సేకరించిన వీర్యాన్ని కాకుండా సీక్రెట్ గా తన వీర్యాన్ని ఉపయోగించాడని అమెరికాకి చెందిన ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ మహిళకు మాత్రమే కాకుండా మరికొందరికి మహిళలకు కూడా తన వీర్యాన్ని వాడి గర్భం దాల్చేలా చేశాడు. అమెరికాలో డాక్టర్ మోరిస్ వోర్ట్మన్ పై న్యూయార్క్ కు చెందిన మహిళ కేసు దాఖలు చేశారు.

1980లో దాతల నుండి సేకరించిన వీర్యంతో ఓ మహిళ ప్రెగ్నెంట్ అయ్యింది. రోచెస్టర్ కు చెందిన మోరీస్ వోర్ట్మన్ అనే డాక్టర్ ఆ మహిళకు ట్రీట్ మెంట్ చేసి ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడు. ప్రస్తుతం ఆమెకు జన్మంచిన మహిళ అది మోరిస్ వీర్యమేనంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టులో కంప్లైంట్ చేసిన మహిళ అదే వైద్యుడి దగ్గర గైనిక్ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది. 1985 లో తాను జన్మించానని.. డీఎన్ఏ జీనాలజీ టెస్ట్ చేయించుకుంటే తనకు తొమ్మిది మంది తోడ బుట్టినవారున్నారని అన్నారు.

ఈ క్రమంలో డాక్టర్ స్పందించకపోవడం గమనార్హం. అలాగే డాక్టర్ తరఫు న్యాయవాది కోర్టులో సదరు డాక్టర్ కార్యాలయాన్ని కూడా చెప్పలేదు. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా ఎన్నో బయట ప్రపంచానికి తెలిశాయి. డాక్టర్లను దేవుళ్ళుగా భావించి వచ్చిన వారిని కొంతమంది డాక్టర్లు అతి దారుణంగా మోసం చేస్తున్నారు.

గతంలో ఇండియాలో డాక్టర్ డొనాల్డ్ క్లైన్ అనే వ్యక్తి తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన మహిళలకు తన వీర్యాన్ని అందించాడు. ఇతనికి కోర్టు అతడి లైసెన్స్ ని ఏడాది పాటు రద్దు చేసింది. ఇలాంటి ఘటనలపై ఎంతోమంది డాక్యుమెటరీలు కూడా తెరకెక్కిస్తున్నారు.