Bigg boss: బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రు.. లెక్క‌లు మొత్తం మారిపోతున్నాయిగా..!

Bigg boss: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మం మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఈ కార్యక్ర‌మం 19 మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లు కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో 8 మంది మాత్ర‌మే ఉన్నారు. వీరిలో కెప్టెన్ ఎవ‌రు అనే దానిపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఈ సారి టైటిల్ రేసులో ప్రధానంగా ముగ్గురు కనిపిస్తున్నారు.
who is the winner in bigg boss house2
who is the winner in bigg boss house2

అందులో అందరూ ఊహించినట్లుగానే యాంకర్ రవి ఉన్నాడు. మనోడు పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నాడు. అందర్నీ వాడుకుంటూ తాను పబ్బం గడిపేస్తున్నాడు. కొన్నిసార్లు బుక్ అయినా కూడా.. చాలాసార్లు సేవ్ అయ్యాడు రవి. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్‌లో రవికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్ని విషయాల్లో మనోడికి మైనస్‌లు కూడా ఉన్నాయి.

మరోవైపు ఈ సారి రవి తర్వాత టైటిల్ రేసులో ఉన్న మరో కంటెస్టెంట్ శ్రీరామచంద్ర. పదేళ్ళ కిందే ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచి ఇండియా అంతా ఫేమస్ అయ్యాడు శ్రీరామ్. అప్పట్నుంచి మనోడికి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ 5 తెలుగులోనూ తన సత్తా చూపిస్తున్నాడు ఈయన. ముఖ్యంగా టెంపర్‌మెంట్ విషయంలో మనోడికి నూటికి నూరు మార్కులు పడతాయి. ఎక్క‌డ నెగ్గాలో ఎక్క‌డ త‌గ్గాలో శ్రీరామ్‌కి బాగా తెలుసు.

who is the winner in bigg boss house1
who is the winner in bigg boss house1

సీజన్ మొదట్లో అల్లాటప్పాగానే కనిపించినా కూడా.. గత కొన్ని వారాలుగా దూసుకుపోతున్నాడు స‌న్నీ. ఈ సీరియల్ నటుడు బిగ్ బాస్‌లో కుమ్మేస్తున్నాడు. కొన్ని రోజులుగా సన్నీ గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఈయనకు ఫాలోయింగ్ కూడా అలాగే పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే విన్నర్ అయ్యే అవకాశాలు సన్నీకే పుష్పలంగా కనిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బిగ్ బాస్ 5 విన్నర్ టైటిల్ సన్నీ చేజారిపోదు.

ఇప్పుడున్నట్లు ఇలాగే గేమ్ కంటిన్యూ చేస్తే సన్నీకి తిరుగు లేదనేది బయట వినిపిస్తున్న సమాచారం. మరోవైపు షణ్ముఖ్ జస్వంత్ కూడా రేసులోనే ఉన్నా.. కొన్ని మైనస్‌ల కారణంగా షణ్ణు తప్పుకోవాల్సి వస్తుంది.