Whale Vomit : తిమింగలం వాంతి ఖరీదు 50 కోట్లు.! తమిళనాడు జాలర్లకు దొరికిన వైనం.!

NQ Staff - October 3, 2022 / 02:46 PM IST

Whale Vomit : తిమింగలం వాంతి ఖరీదు 50 కోట్లు.! తమిళనాడు జాలర్లకు దొరికిన వైనం.!

Whale Vomit : ఛీ.! వాంతి గురించి మాట్లాడొద్దు.! అలా మాట్లాడితేనే వాంతి వచ్చేస్తుందంటారు చాలామంది. కానీ, తిమింగలం వాంతికి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో తిమింగలం వాంతి ఖరీదు కోట్ల రూపాయల్లో వుంటుంది.

తాజాగా, తమిళనాడులోని కల్పక్కం సమీపంలో జాలర్ల వలకు తిమింగలం వాంతి చిక్కింది. దీన్ని ‘అంబర్ గ్రిస్’ అంటారు. సుమారు 38.6 కిలోల ‘అంబర్ గ్రిస్’ జాలర్లకు చిక్కింది. చెంగల్పట్లు జిల్లా కల్పక్కం సమీప గ్రామం కడపాక్కంకి చెందిన ఇంద్రకుమార్, మాయ కృష్ణన్, కర్ణన్, శేఖర్ అనే జాలర్లు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళారు.

వల విసిరారు.. బంగారం పట్టారు.!

జాలర్లు విసిరిన వలలో ‘అంబర్ గ్రిస్’ చిక్కింది. దీని బరువు 38.6 కిలోలు. అంబర్ గ్రిస్ విషయమై కఠినమైన చట్టాలున్నాయి. ఈ నేపథ్యంలోనే జాలర్లు ఈ ‘అంబర్ గ్రిస్’ని అటవీశాఖ అధికారులకు అందజేశారు. మార్కెట్‌లో దీని విలువ 50 కోట్లు వుంటుందని అధికారులు పేర్కొన్నారు.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అంబర్ గ్రిస్ వెలుగు చూసిన దాఖలాలున్నాయి. తిమింగలం జీర్ణాశయం చాలా చాలా ప్రత్యేకంగా నిర్మితమై వుంటుంది. పూర్తిగా జీర్ణం కాని కొంత భాగం, గట్టి పడి వుంటుంది. అలా జీర్ణంకాని భాగం వాంతి రూపంలో బయటకు వస్తుంటుంది.. అదీ చాలా అరుదుగా. అదే ‘అంబర్ గ్రిస్’. దీన్ని కాస్మొటిక్స్ తయారీ రంగంలో వినియోగిస్తారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us