VVS Laxman: ఆబాద్ అద్భుత ఆలోచ‌న‌.. ప్ర‌శంస‌లు కురిపించిన వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌

VVS Laxman: భార‌త క్రికెట్‌కు సంబంధించిన లెజెండ్స్‌లో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ త‌ప్ప‌క ఉంటారు. మ‌ణిక‌ట్టు మాయాజాలంతో ఎన్నో ప‌రుగులు చేసిన ఆయ‌న భార‌త్‌కు అద్భుతమైన విజ‌యాలు అందించారు. ప్ర‌స్తుతం ల‌క్ష్మణ్ కామేంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. సోష‌ల్ మీడియాలోయాక్టివ్‌గా ఉండే ల‌క్ష్మ‌ణ్ క్రికెట్ గురించి స్పందించ‌డ‌మే కాకుండా స‌మాజంలో జ‌రిగే ప‌లు విష‌యాల‌పై స్పందిస్తుంటాడు.

VVS Laxman Tweet about Aabad from Churu in Rajasthan
VVS Laxman Tweet about Aabad from Churu in Rajasthan

తాజాగా ఓ వ్య‌క్తి అద్భుత‌మైన ఆలోచ‌న మెచ్చిన ల‌క్ష్మ‌ణ్ త‌న ట్విట్ట‌ర్‌లో వారి ఫొటోలు షేర్ చేస్తూ పొగ‌డ్త‌లు కురిపించాడు. రాజ‌స్థాన్ లోని చురుకి చెందిన ఎండీ ఆబాద్ అనే వ్య‌క్తిని తాగునీటిని ఉచితంగా ఇచ్చేందుకు ప‌ట్ట‌ణం అంతా తిరుగుతుంటాడు. అబాద్ త‌న రిక్షాకు వాట‌ర్ ట్యాంక‌ర్, కూల‌ర్‌తో పాటు 500 వాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశాడు.

ఉచితంగా ఆయ‌న వాట‌ర్ స‌ప్లై చేస్తుండ‌గా, వేలాది మంది దాహం తీరుస్తున్నారు. ఆబాద్ అద్భుత‌మైన ఆలోచ‌న‌తో ఎంతో మంది సాయం పొందుతున్నారు.అత‌నిపై లక్ష్మ‌ణ్ ప్ర‌శంసలు కురిపించ‌డంతో ఆబాద్‌పై నెటిజ‌న్స్ కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ల‌క్ష్మ‌ణ్ ట్వీట్‌తో ఇప్పుడు అంద‌రి దృష్టి ఆబాద్‌పై ప‌డింది.

ల‌క్ష్మ‌ణ్ తాజాగా కోహ్లీపై కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. కెప్టెన్‌గా తాను తీసుకున్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటున్నాడు.అందుకే అద్భుత‌మైన విజ‌యాలు సాధిస్తున్నాడ‌ని తెలియ‌జేశాడు.