vishwa bhushan harichandan: ఏపీ గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలింపు

vishwa bhushan harichandan: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

TheNewsQube-
vishwa bhushan harichandan health not good
vishwa bhushan harichandan health not good

ఇటీవ‌ల గ‌వ‌ర్నర్.. ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. బ్యాంకులతో చేసుకున్న ఒప్పంద పత్రాల్లో వ్యక్తిగతంగా తన పేరును చేర్చడంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు లేఖ రాసారు.

vishwa bhushan harichandan health not good1
vishwa bhushan harichandan health not good1

బ్యాంకులతో చేసుకున్న ఒప్పంద పత్రాల్లో గవర్నర్‌ పేరును వ్యక్తిగతంగా చేర్చారు. అంటే… ఎస్‌డీసీ తీసుకున్న రుణాలకు ఆయనే హామీ! ఇలా తన పేరును వ్యక్తిగతంగా ప్రస్తావించడంపై విశ్వభూషణ్‌ సీరియ్‌సగా స్పందించారు. ఎందుకిలా జరిగిందంటూ సీఎస్‌కు లేఖ రాసినట్లు సమాచారం.