Viral Video: బురద రోడ్లపై నవ వధువు ఫోటో షూట్.! ప్రచారం కోసమా.? ప్రశ్నించడం కోసమా.?

NQ Staff - September 21, 2022 / 04:04 PM IST

159898Viral Video: బురద రోడ్లపై నవ వధువు ఫోటో షూట్.! ప్రచారం కోసమా.? ప్రశ్నించడం కోసమా.?

Viral Video: పిచ్చి పరాకాష్టకు చేరిందనాలో లేక, నిజంగానే సామాజిక బాధ్యత అనాలో తెలియని దుస్థితి ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్‌లో. ఇంతకీ టాపిక్ ఏంటంటారా.? ఓ నవ వధువు. అదేనండీ పెళ్లికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి ఈ మధ్య బాగా వింటున్నాం కదా.

అలాంటి ఓ ఫోటో షూట్‌. అయితే, ఈ ఫోటో షూట్స్ కోసం కాస్ట్‌లీ కాస్ట్యూమ్స్, కాస్ట్‌లీ బ్యాక్ గ్రౌండ్స్, ఇంకా కాస్ట్‌లీ లొకేషన్స్.. ఇలా ఎంచుకుంటుంటారు కదా బోలెడంత కాస్ట్ పెట్టి. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఫోటో షూట్‌కి అంత సీను లేదు.

గుంతల రోడ్లే లొకేషన్లు..

Viral Video Of Cameraman Taking Pictures Of Bride

Viral Video Of Cameraman Taking Pictures Of Bride

వధువు ఒక్కతే. ఒక కెమెరామేన్.. సింపుల్‌గా కెమెరా పట్టుకుని ఫోటోలు తీసేస్తున్నాడు. హో.! లో బడ్జెట్ అయ్యుంటుంది. సింపుల్‌ లొకేషన్లలో కానిచ్చేస్తున్నారేమో అనుకుంటున్నారా.? అయితే తప్పులో కాలేసినట్లే.

సామాజిక బాధ్యతతో గుంతల రోడ్లపై వధువు ఫోటో షూట్ చేయించుకుంటోంది. ఇటీవల పడిన వర్షాలకు గుంతలు పడి, ఆ గుంతల నిండా నీళ్లతో నిండి, వాహనదారులకు అత్యంత ప్రమాదకరంగా మారిన రోడ్లపై వయ్యారంగా నడుస్తూ ఆ నవ వధువు ఫోటోలకు పోజిచ్చింది.

అదేంటీ.? ఇదేం పిచ్చి అనుకుంటున్నారా.? ఇక్కడే సామాజిక బాధ్యత దాగి వుందట. కనీసం ఈ ఫోటోలు చూసి అయినా ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయిస్తుందనేది ఆమె కోరికట. ఈ ఫోటోలూ, వీడియోలను యారో వెడ్డింగ్ కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. విపరీతమైన స్పందన వచ్చింది ఈ ఫోటోలకు.

వీడియోని ఇంతవరకూ ఏకంగా 43 లక్షల మందికి పైగా వీక్షించారట. 37 లక్షల మంది లైక్ చేశారట. వధువు వివరాలేమీ తెలియదు కానీ, కేరళలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. కొందరు ఈ నవ వధువు చేసిన చర్యకు ప్రశంసిస్తుంటే, మరికొందరు పిచ్చి పరాకాష్టకు చేరింది. ఇలా చేస్తే మాత్రం ప్రభుత్వం దిగొస్తుందా.? అని వ్యంగ్యంగా రెస్పాండ్ అవుతున్నారు.