Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర’లో ‘విలేజ్ కుకింగ్’ టీమ్.!
NQ Staff - September 9, 2022 / 08:06 PM IST

Bharat Jodo Yatra : యూ ట్యూబ్ పుణ్యమా అని చాలామంది సామాన్యులు సెలబ్రిటీస్ అయిపోయారు, అవుతూనే వున్నారు.! ఓ పెద్దాయన, ఆయనతోపాటు కొంతమంది కుర్రాళ్ళు.. వెరసి ఓ బృందంగా ఏర్పడ్డారు. తమిళనాడుకి చెందిన ఈ ‘బ్యాచ్’, వంటకాలు చేయడంలో దమ్మున్నోళ్ళని నిస్సందేహంగా చెప్పొచ్చు.

village cooking team with rahul gandhi Bharat Jodo Yatra
చిన్నా చితకా వంటకాలు కాదు, పదుల కేజీలు.. వందల కేజీల్లో వంటలు చేసేస్తుంటారు. అంతా పద్ధతిగానే సుమండీ.! అంటే, కట్టెలతోనూ, సెలయేళ్ళ దగ్గర, చెరువుల దగ్గర లభించే నీళ్ళతోనూ వంట చేసేస్తారన్నమాట. లక్షల్లో, కోట్లల్లో వ్యూస్ వచ్చేస్తుంటాయి వీళ్ళు చేసే వంటకాలకు సంబంధించిన వీడియోలకి.
రాహుల్ గాంధీ టూర్‌లో.. విలేజ్ కుకింగ్ టీమ్..
ఈ విలేజ్ కుకింగ్ టీమ్ సభ్యులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో సందడి చేశారు. ఆ టీమ్ సభ్యులతో కలిసి ముందడుగు వేశారు రాహుల్ గాంధీ. వారితో మాటామంతీ.. భలేగా సాగించారు కాంగ్రెస్ నేత.
పెద్దాయన సహా విలేజ్ కుకింగ్ టీమ్ సభ్యులంతా వెంట నడవడంతో, రాహుల్ గాంధీలో కొత్త ఉత్సాహం కనిపించింది. తమిళనాడు నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం విదితమే. తనది రాజకీయ యాత్ర కాదనీ, ప్రజల్లో చైతన్యం పెంచే యాత్ర అనీ రాహుల్ గాంధీ చెబుతోన్న విషయం విదితమే.
పైకి రాహుల్ ఏం చెప్పినా, ప్రధాని పీఠమెక్కడమే లక్ష్యంగా ఆయన ఈ జోడో యాత్ర ప్రారంభించారన్నది నిర్వివాదాంశం.