Vande Bharat Express : ఈ వందే భారత్ రైళ్ళకేమైంది.? తప్పంతా ప్రధాని మోడీదేనా.?

NQ Staff - October 7, 2022 / 10:03 PM IST

Vande Bharat Express : ఈ వందే భారత్ రైళ్ళకేమైంది.? తప్పంతా ప్రధాని మోడీదేనా.?

Vande Bharat Express : వందే భారత్ రైళ్ళు.. భారతదేశంలో బుల్లెట్ రైళ్ళు ప్రస్తుతానికి ఇవేనంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇవి బుల్లెట్ రైళ్ళు కావు, హై స్పీడ్ రైళ్ళు.

భారతదేశంలో అత్యంత వేగంతో వెళ్ళే రైళ్ళుగా వందే భారత్ రైళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ఇటీవలే ఇవి దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే మూడు నాలుగు రైళ్ళు మాత్రమే ప్రయాణీకులకు సేవలందిస్తున్నాయ్. ముందు ముందు వీటి సంఖ్య గణనీయంగా పెరగబోతోంది.

ప్రమాదాలతో వార్తల్లోకెక్కుతున్న వందే భారత్ రైళ్ళు..

గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హై స్పీడ్ రైళ్ళు తాజాగా వివాదాస్పదంగా వార్తల్లోకెక్కుతున్నాయ్. పట్టాలపై రైలు దూసుకుపోతున్న సమయంలో గేదెలు అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. నాలుగు గేదెలు చనిపోయాయి. రైలు ముందు భాగం కొంతమేర డ్యామేజ్ అయ్యింది.

కేవలం ఇరవై నాలుగ్గంటల వ్యవధిలోనే ఆ డ్యామేజీని సరిదిద్దగలిగారు. ఇదో రికార్డు.! మరోపక్క, ఇంకో ప్రమాదంలో ఓ ఆవుని రైలు ఢీకొట్టింది. అయితే, రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ ప్రమాదం జరగడం.. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో వుండడం.. వెరసి ప్రమాద తీవ్రత చాలా తక్కువగా వుంది.

కాగా, ప్రమాదాలకు పూర్తి బాధ్యత ప్రధాని మోడీ వహించాలంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హై స్పీడ్ రైళ్ళు ప్రయాణించే మార్గాల్లో రైలు పట్టాలకు ఇరు వైపులా కంచె ఏర్పాటు వుండాలన్నది ప్రధానంగా వినిపిస్తోన్న డిమాండ్.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us