Bride: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పెళ్ళికొడుకు కావాలంటూ పెళ్లి ప్రకటన

Bride: కరోనా కారణంగా ప్రపంచంలో ఎన్నో విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి మొదలై 18 నెలలు దాటుతోంది. అందుకే సైంటిస్టులు కూడా ఎక్కువ టైమ్ తీసుకోకుండా వ్యాక్సిన్ ను కనిపెట్టారు. ప్రస్తుతం ప్రతి ఒక్క రూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన పరిస్థితి. పెళ్ళి చేసుకోవడానికి కూడా వ్యాక్సిన్ వేసుకున్న పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కావాలంటూ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కుటుంబం తన కుమార్తె కోసం వ్యాక్సిన్ వేయించుకున్న వరుడు కావాలంటూ పెళ్ళి ప్రకటనలో కోరారు.

Vaccinated Bride Seeks Vaccinated Groom
Vaccinated Bride Seeks Vaccinated Groom

అసలు ఈ ప్రకటన విషయానికి వస్తే.. వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుండి కోవిడ్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత 45 సంవత్సరాలు పైబడిన వారికి అనుమతి కల్పించారు. వ్యాక్సిన్ పై అవగాహనతో ఇప్పుడిప్పుడే అందరూ వేయించుకుంటున్నారు.

18 ఏళ్ళపై వారికి వ్యాక్సిన్ ను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేయించుకున్నవారికి, పెళ్ళికాని వారికి ఇంకాస్త కష్టంగా మారింది. దానికి కారణం ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పెళ్ళి ప్రకటన. పెళ్ళి కోసం ప్రకటనలు ఇస్తుంటారు. వాటిల్లో చాలా రిక్వైర్ మెంట్స్ ఉంటాయి.

అందులో ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ ట్రెండ్ తో సరికొత్త ప్రకటనలు చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వరుడు కావాలని జూన్ 4వ తేదీన ఓ పేపర్ ప్రకటనలో వచ్చింది. రోమన్ కేథలిక్ ఫ్యామిలీకి చెందిన తమ అమ్మాయి కోవీషీల్డ్ తీసుకున్న వరుడు కావాలని ప్రకటించారు.

ఈ ప్రకటనను ఫోటో తీసి వైరల్ చేశారు. ఈ ప్రకటన కేవలం ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాత్రమే చేసిన ప్రకటన అని అంటున్నారు గోవాలోని అల్డోనాకు చెందిన కమ్యూనిటీ ఫార్మసిస్ట్. ఈయన క్రియేట్ చేసిన ఫ్యూచర్ ఆఫ్ మ్యాట్రిమోనియల్స్ పేరుతో ఓ ఫేక్ ప్రకటన చేశారు. కేవలం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కలిగించడానికి ఇలా చేశామని, అసలు విషయాన్ని పక్కన పెట్టి వైరల్ చేయడానికి మాత్రమే ఇలా చేసుంటారని తెలిపారు.