Protection : కోడిపై కేసు పెట్టి న వృద్ధ దంపతులు.. ఇంతకీ కోడి చేసిన నేరం ఏంటో తెలుసా?
NQ Staff - August 23, 2022 / 06:02 PM IST

Protection : సాధారణంగా గ్రామాలలో కోళ్లను ఎక్కువగా మనం చూస్తుంటాం. వాచీలు లేనప్పుడు కోడి అరుపుతోనే నిద్ర లేచేవారు. కోడి కూతతో పనులు ప్రారంభించే వారు. వాటి అరుపు తక్కువ స్థాయిలోనే ఉంటుంది. అది మనకు అంత ఇబ్బందిగా అనిపించదు. కానీ జర్మనీలోని ఓ కోడి మాత్రం తన కూతతో స్థానికులను హడలెత్తిస్తోంది. కోడి అరుపుల నుంచి తట్టుకోలేక తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కూత సమస్య..

Unable Resist Screams Chickens Approached Court For Protection
పక్కింట్లోని కోడి రోజూ రెండు వందల సార్లకుపైగా బిగ్గరగా కూత పెడుతోందని.. అది భరించలేకపోతున్నామని.. దాన్ని వెంటనే ఎక్కడికైనా తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జర్మనీలోని వోర్సెస్టర్ నగరానికి చెందిన మైఖేల్ అనే వ్యక్తి ఐదేళ్ల కిందట పెంచుకునేందుకు కొన్ని కోళ్లను తెచ్చుకున్నారు. అందులో ఓ కోడి పుంజు కూడా ఉంది.
చాలా యాక్టివ్ గా ఉండే ఆ కోడి పుంజుకు మాగ్డా అని ముద్దుపేరు పెట్టుకుని పెంచుకుంటున్నాడు. అది నిత్యం కొక్కరకో అంటూ కూత పెడుతోంది. ఆ ఇంటి పక్కనే ఉండే 76 ఏళ్ల ఫ్రెడరిక్ విల్ హెం, ఆయన భార్య జుట్టాలకు మాత్రం ఈ కోడి కూత భరించలేని విధంగా తయారైంది. రోజూ రాత్రి కోళ్లను గూట్లోకి పంపే మైఖేల్.. మరునాడు పొద్దున 8 గంటలకు తన ఇంటి ఆవరణలోకి వదులుతాడు. అప్పటి నుంచి రాత్రిదాకా మాగ్డా కోడి పుంజు రెండు వందల సార్లు కూత పెడుతుందని ఫ్రెడరిక్ దంపతులు కోర్టుకు ఫిర్యాదు చేశారు.
దీనిపై వోర్సెస్టర్ నగర అధికారులు విచారణ ప్రారంభించారు. మైఖేల్ ఇంటి చుట్టుపక్కల వారిని అడిగితే.. తామంతా ఆ కోడి పుంజు వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. మైఖేల్ కు ఈ విషయం చాలా సార్లు చెప్పినా పట్టించుకోలేదని అధికారులకు తెలిపారు. ఫోన్లు మాట్లాడుకోలేకపోతున్నామని, జూమ్ మీటింగుల్లోనూ డిస్ట్రబెన్స్ గా ఉంటోందని ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు మైఖేల్ ను పిలిపించి.. అతడి కోళ్లను మరో చోటికి తరలించాల్సిందిగా ఆదేశించారు.