Viral Video : బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్ లో ఫైటా? ఇంత అరాచకేంది అమ్మాయిలు?

NQ Staff - August 27, 2022 / 03:01 PM IST

Viral Video  : బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్ లో ఫైటా? ఇంత అరాచకేంది అమ్మాయిలు?

Viral Video  : నిజం. వాడు నా వాడంటే నావాడంటూ బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు బస్టాండ్‌ లోనే జుట్లు పట్టుకుని కొట్టుకుని జనాలకు ఫ్రీ షో వేశారు. అసలు మ్యాటరేంటంటే.. ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఒకే కుర్రాడిని లవ్ చేశారు. మనోడు కూడా ఒకరికి తెలీకుండా ఒకరిని మ్యానేజ్ చేస్తూ వస్తున్నాడు. చివరాఖరికి విషయం బయటపడి ఇంత రచ్చయింది. మహారాష్ట్రలోని పయ్ థాన్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనిది.

మన హీరో లవ్ చేసిన ఇద్దరమ్మాయిల్లో ఒక అమ్మాయి ఆ కుర్రాడితో కలిసి లోకల్ బస్టాండ్ కొచ్చింది. వాడి దురదృష్టానికి మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. ఏంటి బంగారం ఇది? ఎవరిది? అంటూ నిలదీసింది. ఆ తర్వాత విషయం తెలిసి వాడు నా వాడంటే నావాడంటూ
ఇద్దరూ జుట్టు జుట్టు పట్టుకుని జనాల ముందే పొట్టు పొట్టు తన్నుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఆపడానికి కూడా చూశారు.అయినా వీరావేశంతో వీళ్లిద్దరూ కొట్టుకుంటూనే ఉండగా, ఇదే సందనుకుని ఆ గ్యాప్ లో ప్రియుడు అక్కడి నుంచి పరార్

Two Girls Fight For Boy Friend

Two Girls Fight For Boy Friend Viral Video 

ఇంత ఫైటింగే వాడికోసం.. కానీ వాడు పారిపోయినా పట్టించుకోకుడా వీళ్లు కసిగా ఫైట్ కంటిన్యూ చేసే పనిలో బిజీ అయ్యారు. విషయం తెలిసి పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరినీ స్టేషన్ కు తీసుకెళ్లి వాళ్ల కుటుంబసభ్యుల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు.

మరిది కలికాలం అనుకోవాలో, పోయేకాలం అనుకోవాలో అంటూ ఈ మ్యాటర్ ను సోషల్మీడియాలో చూసిన నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అయినా అమ్మాయి కోసం అబ్బాయిలు యుద్ధాలు చేసే రోజులు పోయాయి బాస్. ఓ అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడమే నయా ట్రెండ్ అంటూ మరికొందరు సెటైర్స్‌ వేస్తున్నారు. ఇంత సీనయ్యాక ఆ ఇద్దరమ్మాయిల ముద్దుల లవర్ పరిస్థితేంటో మరి?

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us