Tourist: టూరిస్ట్‌గా వ‌చ్చిన అమ్మాయిని ప్రేమ‌లో ప‌డేసి పెళ్లి చేసుకున్న గైడ్

Tourist:ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ‌రికి తెలియ‌దు. ఖండాంత‌రాలు కూడా దాటి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజా ఓ ఫ్రాన్స్‌ అమ్మాయి బిహార్‌కు చెందిన ఓ అబ్బాయి ప్రేమలో పడిపోయాను. అంతేకాదు హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఎల్లలు లేని ప్రేమ ఊరు, వాడ, దేశాన్నే దాటి విహరిస్తోంది అనేది సాక్ష్యంగా చెబుతున్నారు.

tourist marries a foreign woman
tourist marries a foreign woman

పారిస్‌కు చెందిన మేరీ లోరీ ఆరేళ్ల క్రితం ఇండియా పర్యటనకు వచ్చింది. అదే సమయంలో ఆమెకు ఢిల్లీలో టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తున్న రాకేష్‌ కుమార్‌ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా స్నేహంగా మారింది… తర్వాత వారిరువురి మధ్య ప్రేమ చిగురించింది.

ఇరువురు ఫోన్‌ నెంబర్లు మార్చుకున్నారు..మేరి ఫ్రాన్స్‌కు వెళ్లిపోయిన తర్వాత రాకేష్‌కి ఫోన్ చేసింది.. తనతోపాటు టెక్స్‌టైల్‌ బిజినెస్‌ చేసేందుకు ఫ్రాన్స్‌ రమ్మంటూ పిలిచింది. దాంతో ఫ్రాన్స్ వెళ్లిన రాకేష్ ఆమెతో కలిసి బిజినెస్‌ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. నూరేళ్ల జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకున్నారు.

tourist marries a foreign woman1
tourist marries a foreign woman1

ఇండియాలోని బిహార్‌ హిందూ సంప్రదాయాల ప్రకారం మేరి పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇందుకు ఆమె తన కుటుంబాన్ని కూడా ఒప్పించి పెళ్లి కోసం ఇండియాకు తీసుకొచ్చింది. నవంబర్‌ 21న వీరిద్దరూ భారతీయ సంప్రదాయం ప్రకారం మూడుమూళ్ల బంధంతో ఒకటయ్యారు. ఫ్రాన్స్‌ వధువుని, కుటుంబాన్ని చూసేందుకు గ్రామస్తులు, స్థానిక జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.