Harbajan singh:హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, మ‌హ్మ‌ద్ అమీర్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్..!

Harbajan singh:టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా ఆదివారం జ‌రిగిన కీలకమైన పోటీలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ టీం ముందు 152 లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని పాక్ ఆట‌గాళ్లు సునాయాసంగా చేధించారు. అయితే పాక్ విజ‌యం త‌ర్వాత భార‌త్ ఆట‌గాళ్ల‌ను ఉద్దేశించి చాలా మంది త‌ప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.

TheNewsQube-
tiwtter war between amir and singh 1
tiwtter war between amir and singh 1

తాజాగా భార‌త మాజీ స్పిన్ప‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌,పాక్ మాజీ పేస‌ర్ మ‌హమ్మ‌ద్ అమిర్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ న‌డించింది. అమీర్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ.. అందులో హ‌ర్భ‌జ‌న్ బౌలింగ్‌లో ఆఫ్రిది వ‌రుస సిక్స‌ర్స్ కొట్టిన‌ట్టు చూపించాడు. దీనికి భ‌జ్జీ.. 2010లో ఇంగ్లండ్-పాక్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో అమీర్ నోబాల్ క్లిప్పింగ్ పోస్ట్ చేశాడు.

ప్ర‌జ‌లు నిన్ను చూసేది డ‌బ్బు కోసం పాకులాడేవాడిగానే. గౌరవం, అభిమానం ఏం లేదు. డ‌బ్బు మాత్ర‌మే ఉంది. మీ దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుదారుల‌కు ఎంత ల‌భించిందో మీరు చెప్ప‌రు. క్రికెట్‌ని ఈవిధంగా అవ‌మానించి ప్ర‌జ‌లను ఫూల్స్ చేసిన నీలాంటి వాడితోమాట్లాడుతున్నందుకు బాధ‌గా ఉంది అని భ‌జ్జీ పేర్కొన్నాడు.

tiwtter war between amir and singh
tiwtter war between amir and singh

మ‌రో ట్వీట్‌లోఅమీర్ బౌలింగ్‌లో భ‌జ్జీ సిక్స‌ర్ బాది టీమిండియాను గెలిపించిన వీడియో పోస్ట్ చేసి ఫిక్స‌ర్‌కి సిక్సర్ ఇక ప‌ద పోదాం అనే క్యాప్ష‌న్ పెట్టాడు. అమీర్ .. ఇంగ్లండ్ సిరీస్‌లో ఫిక్సింగ్‌కి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే.

29 ఏళ్త వ‌య‌స్సులోనే అమీర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అమిర్‌తో పాటు ఫిక్సింగ్ చేసిన వారిలో మ‌హ‌మ్మ‌ద్ అసిఫ్‌, స‌ల్మాన్ ఉన్నారు.