Poison Garden: ఈ గార్డెన్‌లో మొక్క‌లు ముట్టుకున్నా, వాస‌న చూసినా ఇక చావే గతి..!

Poison Garden: ప్ర‌కృతి నుండి పుట్టిన మొక్క‌లు దాదాపు మ‌నుషుల‌కు హాని చేయ‌వు. కొన్ని మొక్క‌లు ప్రాణాలు పోస్తాయి త‌ప్ప ప్రాణాలు తీయ‌డం అస‌హ‌జం. అడ‌వుల‌లో ఎన్నో ర‌కాల మొక్క‌ల‌ను మందుల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో వీటి పాత్ర చాలా కీల‌కం. అయితే ఓ చోట గార్డెన్‌లో ఉన్న మొక్క‌లు మ‌నుషులు న‌ర‌క‌యాత‌న చూపిస్తాయ‌ట‌. ల‌క్ ఉంటే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తారు, లేదంటే అంతే!

The Poison Garden plants is very danger
The Poison Garden plants is very danger

నార్తంబర్‌ల్యాండ్‌లోని ఆల్న్‌విక్ గార్డెన్‌లో విషపు మొక్కలను పెంచుతున్నారు. ‘వరల్డ్ డెడ్లియెస్ట్ గార్డెన్’గా పేరొందిన ఈ పార్కులోకి సందర్శకులను ఒంటరిగా వదిలేయరు. ఒక‌వేళ గార్డెన్‌లో ఎవ‌రైన మొక్క‌ల‌ని తాకుతారేమోన‌నే భ‌యంతో ఒక గైడు కూడా ఉంటార‌ట‌. మొక్క‌లు బాగున్నాయి కదా అని స‌ర‌దాగా ముట్టుకున్నా, వాస‌న చూసిన‌, నోట్లు పెట్టుకున్నా మీ ప‌ని ఖ‌త‌మే.

గ‌తంలో కొంద‌రు ఈ మొక్క‌ల‌ను సంద‌ర్శించ‌డానికి వెళ్లి మూర్చ‌పోయారు. ఆ మొక్కల నుంచి వెలువడిన విషవాయువుల వల్లే వారంతా అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. మ‌రి అంత ప్ర‌మాద‌క‌ర‌మైన మొక్క‌ల‌ను పెంచి వారు ఏం చేస్తున్న‌ట్టు, చంపేయోచ్చు క‌దా అనేదే మీ డౌట్ అయితే, వారు ఈ మొక్క‌లు పెంచ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ట‌. ప్రపంచంలో ఇలాంటి విషపూరిత మొక్కలు కూడా ఉంటాయని చెప్పడం కోసమే ఈ గార్డెన్ ఏర్పాటు చేశారట.

ఫ‌స్ట్ ఔష‌ద మొక్క‌లు వేద్దామని అనుకున్నార‌ట‌. కాని ఇది రొటీన్ అయిపోతుందేమోన‌నే ఉద్దేశంతో విష‌పు మొక్క‌ల‌ను పెంచుతున్నార‌ట‌. ఈ గార్డెన్‌ను నిర్వహించే సిబ్బంది హజ్మత్ సూట్లు ధరించిన తర్వాతే గార్డెన్లో అడుగు పెడతారు. గార్డెన్ నిర్వాహకులు ట్రెవర్ జోన్స్ మాట్లాడుతూ.. ‘‘అవన్నీ సాధారణ మొక్కలే. అవి ఇళ్లలోని గార్డెన్లలో కూడా ఉంటాయి. అయితే, అవి ఎంత ప్రమాదకరమైనవో ప్రజలకు తెలీదు.

మా గార్డెన్‌ని సంద‌ర్శించిన త‌ర్వాత మ‌నం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన మొక్క‌లు పెంచుతున్నామో అర్ద‌మ‌వుతుంది. మా గార్డెన్‌లో 100 వ‌ర‌కు విష‌పూరిత మొక్క‌లు ఉన్నాయి. ఇందులోని నీలం రంగు పువ్వులు పూసే మాంక్‌షుడ్ అనే మొక్క కాయలు, ఆకులు, కాండం చాలా ప్రమాదరమైనవి. కొన్ని మొక్క‌లు విషాన్ని చిమ్ముతుంటాయి. ఫొటో‌టాక్సిక్ ప్లాంట్ వల్ల చర్మం కాలిపోతుంది. ఏడేళ్ల వరకు ఆ బొబ్బలు తగ్గుముఖం పట్టవు. కాబ‌ట్టి మొక్క‌లలో విష‌పు మొక్క‌లు ఉంటాయి. వాటితో జాగ్ర‌త్త‌గా ఉండండి అని హెచ్చ‌రిస్తున్నారు.