KCR : ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆయుద పూజ

NQ Staff - October 7, 2022 / 08:40 AM IST

KCR : ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆయుద పూజ

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా ప్రగతి భవన్ లో ఆయుధ పూజ నిర్వహించారు. దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అదే సమయంలో గన్స్ మరియు బుల్లెట్స్ కి ఆయుధ పూజ నిర్వహించడం జరిగింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగతి భవన్ లో సెక్యూరిటీ ఆఫీసర్స్ యొక్క ఆయుధాలను ఇలా పూజలో ఉంచడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Telangana CM KCR Dasara pooja

Telangana CM KCR Dasara pooja

ఆయుధ పూజ నిర్వహించడం పండగ ప్రత్యేకత అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ ముఖ్యమంత్రి ఇలా సెక్యూరిటీ ఆఫీసర్స్ యొక్క గన్స్ మరియు బుల్లెట్స్ కి పూజ నిర్వహించడం సరైనదేనా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు.

కొందరు మాత్రం ఈ విషయంను తప్పుపట్టాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా నిర్వహించిన గన్స్ మరియు బుల్లెట్స్ ఆయుధ పూజ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అర్ధరహితమైనదని అవసరం లేనిదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telangana CM KCR Dasara pooja

Telangana CM KCR Dasara pooja

ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ప్రధానంగా కేటీఆర్ తనయుడు హిమాన్షుని కూడా చూడవచ్చు. కేసీఆర్‌ ఆయుద పూజకు సంబంధించిన ఫోటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us