Rohit Sharma: వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత టీమిండియాలో మార్పులు.. కొత్త కెప్టెన్‌గా రోహిత్

Rohit Sharma: రీసెంట్‌గా ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ పూర్తి చేసుకున్న టీమిండియా ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లింది. అక్క‌డ ఐపీఎల్ ఆడి ఆ త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా ఆడ‌నుంది. అయితే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత టీమిండియాలో చాలా చేంజెస్ జ‌ర‌గ‌నున్నాయ‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రి భార‌త విజ‌యాల‌లో ముఖ్య భూమిక పోషిస్తున్న విష‌యం తెలిసిందే.

Team India New Captian Will be Rohit Sharma After World Cup
Team India New Captian Will be Rohit Sharma After World Cup

భారత జట్టు విజయాల్లో హెడ్ కోచ్ రవిశాస్త్రికి దక్కుతున్న క్రెడిట్ తక్కువే ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న కృషిని గుర్తించిన బీసీసీఐ డ‌బ్బులు బాగానే ముట్ట‌జెబుతుంద‌ట‌. 2021 టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత ర‌విశాస్త్రి హెడ్ కోచ్ ప‌దవికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని సాగనంపే దిశగా బీసీసీఐ పావులు కదుపుతుండ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది. ర‌విశాస్త్రి స్థానంలో హెడ్ కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

టీమిండియాకు కెప్టెన్‌గా అనేక విజయాలు అందించడమే కాకుండా.. అంతర్జాతీయ ప్లేయర్‌గా కూడా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. టీ20 జట్లకు కూడా అతడే సారథి. ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న అతడిని కాదని ఎంతో అద్భుతమైన న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న రోహిత్ శ‌ర్మ‌కు వ‌న్డే, టీ 20 బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత లిమిటెడ్ ఓవ‌ర్స్‌కి రోహిత్ కెప్టెన్‌గా ఉండ‌నుండ‌గా, టెస్ట్‌ల‌కు కోహ్లీ ఉంటాడ‌ని స‌మాచారం. ముంబై ఇండియ‌న్స్ జట్టుకు కీలక ఆటగాడిగా ఉంటూ.. క్లిష్ట సమయాల్లో పక్కా ప్రణాళికలను రచిస్తూ రోహిత్ ముంబైకి మొదటి ఐపీఎల్ ట్రోఫీని తెచ్చిపెట్టడమే కాకుండా ఇప్పటివరకు ఐదు ట్రోఫీలను సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయ‌న‌కు కెప్టెన్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తుంది.