Solstice: అక్కడ ఈరోజు రాత్రే ఉండదట.. ఎందుకో తెలుసా!!

Solstice: ప్రతి సంవత్సరం ఓ సుదీర్ఘమైన పగటి కాలం, ఓ సుధీర్ఘమైన రాత్రి సంభవిస్తాయనే విషయం తెలిసిందే. అలా ఈరోజు జూన్ 21న ఈ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. అంటే ఈరోజు మిగతా రోజుల కంటే సూర్యరశ్మి ఎక్కువ సేపు ఉంటుంది. దీన్నే సమ్మర్ సోల్ స్టైస్ అంటారు. ఈ రోజు పగలు సమయం ఎక్కువగా ఉంటుంది. కొన్ని దేశాల్లో వసంత రుతువు ముగిసి, వేసవి మొదలవుతుంది.

Summer Solstice on June 21
Summer Solstice on June 21

ఆటమ్ ఈక్వినోక్స్ అంటే పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు. ఇది సెప్టెంబర్ 23న రాబోతుంది. భూమి పక్కకు ఒరిగే, తిరిగే సంగతి తెలిసిందే. అలా వంగి తిరిగేటప్పుడు ఉత్తర, దక్షిణ ధ్రువాలు సూర్యునికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు పగటి సమయాల్లో మార్పులు వస్తాయి. ఉత్తరార్ధ గోళం సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు సమ్మర్ సోల్ స్టైస్ మొదలవుతుంది.

అంటే ఆ రోజు ఉత్తరార్ధ గోళంలో పగటికాలం ఎక్కువ సేపు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సమ్మర్ సోల్ స్టైస్ రోజు నార్వే, ఫిన్లాండ్, గ్రీన్ లాండ్, అలస్కా సహా మరిన్ని ధ్రువ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశిస్తాడు. వరల్డ్ వైడ్ గా సమ్మర్ సోల్ స్టైస్ రోజున వేడుకలు చేసుకుంటారు. ఈ రోజున చాలామంది బ్రిటన్ లో స్టోన్ హెంజ్ అనే ప్రాంతాన్ని చూస్తారు.

4000 ఏళ్ళ నుండి ప్రార్ధనా స్థలంగా ప్రఖ్యాతి గాంచింది. సమ్మర్ సోల్ స్టైస్ రోజున, ఈ ప్లేస్ లో పడే నీడ హీల్ స్టోన్ నీడతో కలుస్తుంది. సూర్యుడు ఈశాన్య దిక్కులో ప్రకాశిస్తాడు. ఈ దృశ్యాన్ని చూడటానికి భారీ సంఖ్యలో జనాలు వస్తుంటారు. ఈసారి కరోనా కారణంగా సూర్యోదయాన్ని చూడకపోవచ్చు. ఈరోజున ఉత్తరార్థ గోళంలో కర్కాటక రేఖపై సూర్యుడు నిలువుగా ఉంటాడు.

అంటే 23.5 డిగ్రీల అక్షాంశాలకు పైనుండే ప్రాంతాల్లో అస్సలు రాత్రే ఉండదు. ఎందుకంటే ఈ ప్రాంతాలు సూర్యుడికి అత్యంత సమీప దూరంలోకి వస్తాయి. ఈ సమ్మర్ సోల్ స్టైస్ అనేది జూన్ 20 నుండి 22 మధ్య వస్తుంది. అలాగే దక్షిణార్థ గోళంలో వస్తే దాన్ని వింటర్ సోల్ స్టైస్ అంటారు. అప్పటినుండి చలికాలం మొదలవుతుంది.