Srilanka: విమానంలో స‌మ‌స్య‌.. పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న శ్రీలంక క్రికెట‌ర్స్

Srilanka: ఇటీవ‌లి కాలంలో విమానాల‌కు సంబంధించి ఎన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా మంది ప్ర‌ముఖులు కూడా విమాన ప్ర‌మాదంలో మృత్యువాత ప‌డ్డారు. అయితే తాజాగా శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంధ‌న స‌మ‌స్య త‌లెత్త‌డంతో విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అయింద‌ట‌. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు.

Srilanka Cricketers Escape From Big Accident
Srilanka Cricketers Escape From Big Accident

శ్రీల‌కం జట్టు కోచ్‌ మైక్‌ ఆర్థర్ విమానం స‌మ‌స్య గురించి చెబుతూ.. . విమానం భారత్‌లో ల్యాండ్‌ అవ్వగానే ఫోన్‌ ఆన్‌ చేశానని, ఇంగ్లండ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వేన్‌ బెంట్లీ నుంచి తనకు కొన్ని సందేశాలు వచ్చాయని, పరిస్థితి గురించి అతను అందులో వివరించాడని మైక్‌ ఆర్థర్ పేర్కొన్నారు. ఇంధ‌న న‌ష్టం వ‌ల్ల‌నే మా విమానం భార‌త్‌కు వ‌చ్చింద‌ని, ఈ విష‌యం మ‌మ్మ‌ల్నిచాలా కంగారు పెట్టించింద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

పెద్ద ప్ర‌మాదం నుండి శ్రీలంక క్రికెట‌ర్స్ త‌ప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన లంక జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిధ్య ఇంగ్లండ్‌ జట్టు, వన్డే సిరీస్‌ను 2-0తో గెలిచి లంక జట్టును క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న ముగిసాక స్వ‌దేశానికి బ‌య‌లుదేర‌డంతో ఇలాంటి స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. అయితే శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టుతో శ్రీలంక ప‌లు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ టీం లో ఏడుగురికి క‌రోనా రావ‌డం, వారితో శ్రీలంక టీం క్రికెట్ ఆడ‌డంతో సిరీస్‌ఫై ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఈ నెల 13 నుంచి భారత్‌, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగాల్సి ఉంది.

భారత్‌తో సిరీస్‌ కోసం ఇంకా శ్రీలంక జట్టుని ప్రకటించలేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయమై ఆ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో.. విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అసేన్ బండార, కుశాన్ రజిత, లసిత్ ఎంబుల్‌డేనియా తదితర క్రికెటర్లు కాంట్రాక్ట్‌పై సంతకం చేయలేదు. మ‌రోవైపు ఇంగ్లండ్ టూర్ లో బ‌యో బ‌బుల్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన కుశాల్ మెండిస్, గుణతిలక, డిక్లెల్వా సస్పెండ్ అయ్యారు. దాంతో.. శ్రీలంక టీమ్‌ ఎంపికపై ఆ దేశ క్రికెట్ బోర్డు తర్జనభర్జనలు పడుతోంది.