South Korea : హలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట.. 151 మంది మృతి
NQ Staff - October 30, 2022 / 09:13 AM IST

South Korea : దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం జరిగే హాలోవీన్ వేడుకల్లో భాగంగా సియోల్ వీదుల్లోకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఇరుకైన వీధి నుండి జనాలు వెళుతున్న సందర్భంగా ఒకేసారి తొక్కేసలాట చోటు చేసుకోవడం జరిగింది.
దాంతో ఏకంగా 151 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సంఘటనలో మరో 150 నుండి 200 మంది వరకు గాయపడ్డట్లుగా దక్షిణ కొరియా అధికారులు ధ్రువీకరించారు.
400 మంది అత్యవసర సిబ్బంది మరియు 140 వాహనాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఊపిరాడని పరిస్థితిలో రోడ్లపై పడి ఉన్న వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కి తరలించారు.
ఈ కార్యక్రమానికి ఒక సినీ తార వచ్చారు అనే ప్రచారం జరగడంతో ఆ సినీ తారను చూడాలని ఉత్సాహంతో జనాలు పరుగులు పెట్టారని.. దాంతో తొక్కిసలాట జరిగినట్లుగా స్థానికుల నుండి సమాచారం అందుతుంది.
కరోనా అంశాలు ఇటీవల సడలించడంతో దాదాపుగా లక్ష మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరై ఉంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. పలు దేశాల అధినేతలు ఇప్పటికే దక్షిణ కొరియా లో జరిగిన సంఘటనపై స్పందిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.