Toilets: ఆ టాయిలెట్ వాడితే భారీగా న‌గదు ముట్ట‌జెబుతార‌ట‌..!

Toilets: కొన్ని కంపెనీలు ప్ర‌క‌టించే వినూత్న ఆఫ‌ర్స్ అంద‌రికి షాకింగ్‌గా మారుతుంటాయి. తాజాగా ద‌క్షిణ కొరియాలోని టాయ్‌లెట‌న్‌ను ఉప‌యోగిస్తే డ‌బ్బులిస్తార‌ట‌. విన‌డానికి ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నాకూడా ఇది నిజం. దక్షిణా కొరియాలోని ఆ టాయ్‌లెట్‌ను ఉపయోగిస్తే మీకు డబ్బులొస్తాయి. దీనికి పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌క్క‌ర్లేదు కూడా. టాయిలెట్‌ని ఉపయోగించాక అందులో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డ‌బ్బులు నేరుగా అకౌంట్‌లోకి వ‌చ్చేస్తాయ‌ట‌.

Toilets Company in South Korea Variety offer
Toilets Company in South Korea Variety offer

టాయ్‌లెట్స్‌లోని మాన‌వ వ్య‌ర్ధాల‌తో విద్యుత్‌ని పున‌రుద్దించే క్ర‌మంలో ఇలాంటి ఆఫ‌ర్ పెట్టారు. దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చో జై-వూన్ టాయ్‌లెట్‌ను రూపొందించారు. ఆ టాయ్‌లెట్ మానవ వ్యర్థాలతో విద్యుత్‌ను తయారు చేస్తుంది. దాని పేరు `ది బీవి టాయ్‌లెట్`గా పేరు పెట్టారు.

ఈ టాయ్‌లెట్ ద్వారా మాన‌వ వ్య‌ర్ధాల‌ను ఓ ట్యాంకులోకి సేక‌రిస్తారు. కొన్ని సూక్ష్మ‌జీవుల సాయంతో మాన‌వ వ్య‌ర్ధాల‌ను మీథేన్‌గా మారుస్తారు. మీథేన్ సహాయంతో హాట్ బాయిలర్, గ్యాస్ స్టవ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు శక్తిని అందించవచ్చు. `50 లీటర్ల మీథేన్ 0.5 కిలో వాల్టుల విద్యుత్తును తయారు చేస్తుంది. దాని సహాయంతో 1.2 కిలో మీటర్లు కారును డ్రైవ్ చేయవచ్చు.

దీని ద్వారా ఎన్నో విద్యుత్ ప‌రిక‌రాల‌కు శ‌క్తిని కూడా అందించ‌వ‌చ్చు అని అంటున్నారు జైవూన్. దీనికి రాను రాను మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఆయ‌న అంటున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న ఈ టాయ్‌లెట్‌ను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు వర్చువల్ కరెన్సీని పొందవచ్చు. ఏదేమైన ఇలా మాన‌వ వ్య‌ర్ధాల‌తో విద్యుత్‌ని సృష్టించి కొత్త ప్ర‌య‌త్నానికి నాంది ప‌ల‌క‌డం విశేషం.