Elon Musk : మస్క్‌ అరాచకం.. వారంలో ఏడు రోజులు, రోజులో 12 గంటలు డ్యూటీ చేయాల్సిందే

NQ Staff - November 2, 2022 / 02:05 PM IST

Elon Musk : మస్క్‌ అరాచకం.. వారంలో ఏడు రోజులు, రోజులో 12 గంటలు డ్యూటీ చేయాల్సిందే

Elon Musk  :ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ ట్విట్టర్ ని చేజిక్కించుకున్న తర్వాత వినియోగదారులకు అనూహ్య మార్పులు లభిస్తాయని.. ట్విట్టర్ ఇక నుండి మంచి సామాజిక మాధ్యమంగా నిలుస్తుందని అంతా భావించారు.

కానీ మస్క్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్విట్టర్ ప్రక్షాళన మొదలు పెట్టాడు. ఆ ప్రక్షాళన వినియోగదారులకు అనుకూలంగా కాకుండా కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంది. ఆయన రావడంతోనే ముఖ్య అధికారులను తొలగించిన విషయం తెలిసిందే.

75 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు కంపెనీలో పని చేస్తున్న చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వారంలో ఏడు రోజులు జాబ్ చేయాల్సిందే అని.. అలాగే రోజుకు 12 గంటలు విధులు నిర్వహించాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారట.

కొన్నాళ్ల పాటు వారంలో ఏడు రోజులు వీక్ ఆఫ్ లేకుండా పని చేయాల్సిందే అంటూ ఉద్యోగులకు మస్క్ ఆదేశాలు జారీ చేశారని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. ఆ విషయమే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.

మస్క్ ఉద్యోగులకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు, వాటిని చేరుకునేప్పటికీ కాస్త సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు ఉద్యోగులకు ఈ కష్టాలు తప్పవేమో అంటూ ప్రచారం జరుగుతోంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us