Viral Video : ‘దొంగ’ భక్తి.! వినాయక చవితి నేపథ్యంలో గణేష్ విగ్రహాల్ని ఎత్తుకెళ్ళారు.!

NQ Staff - August 30, 2022 / 07:47 PM IST

Viral Video : ‘దొంగ’ భక్తి.! వినాయక చవితి నేపథ్యంలో గణేష్ విగ్రహాల్ని ఎత్తుకెళ్ళారు.!

Viral Video : గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేయడం.. అంటుంటారు కదా.. ఆ మాట సంగతేమో కానీ, ఇక్కడయితే, మండపంలోని వినాయకున్ని అయితే దోచేశారు కొందరు దొంగలు. వినాయక చవితి సందర్భంగా ఓ మండపంలో పెట్టిన వినాయకున్ని కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు.

హైద్రాబాద్‌లోని హయత్ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వినాయక చవితి సందర్భంగా ముందుగానే మండపంలో తీసుకొచ్చి పెట్టిన వినాయక ప్రతిమను ప్రాణ ప్రతిష్ట కాకుండానే దొంగలు ఎత్తు కెళ్లిపోయారు. హయత్ నగర్‌లోని రాఘవేంద్ర భవన్ హోటల్ సమీపంలో ఈ దొంగతనం జరిగింది.

దొంగలు బాబోయ్ దొంగలు.. గణపతినీ దోచేస్తారు.!

Some Thugs Took Ganesh Placed Mandapam Viral Video

Some Thugs Took Ganesh Placed Mandapam Viral Video

సీసీ టీవీ ద్వారా ఈ దొంగతనం బట్టబయలయ్యింది. ఇదేం దొంగ భక్తిరా బాబూ.! అంటూ ఈ విషయం తెలిసిన భక్తులు అవాక్కవుతున్నారు. వినాయక చవితి సందర్భంగా పలు మండపాల్లో వినాయక ప్రతిమలను ఉంచుతున్నారు. ఓ మోస్తరు భారీ నుంచి అతి భారీ విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తుంటారు.

వినాయక చవితి మొదలుకొని పది రోజుల పాటు గణనాధుని వుత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. గణేష్ చవితి సందర్భంగా గల్లీలన్నీ రంగు రంగుల విద్యద్దీపాలతో సర్వాలంకరణ శోభితంగా విలసిల్లుతుంటాయ్.

అలాగే, కొన్ని చోట్ల ఇదిగో ఈ తరహా దొంగతనాలు కూడా జరుగుతుంటాయ్. అయితే, చవితి సందడి మొదలు కాకముందే, ఇలాంటి సంఘటన జరగడం ఆశ్చర్యకరం.

 

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us