Indian Students : యూఎస్ లో తెలుగు విద్యార్థుల క్రెడిట్ కార్డ్‌ మోసాలు.. కఠిన శిక్షలు తప్పవు

NQ Staff - October 29, 2022 / 10:43 AM IST

Indian Students : యూఎస్ లో తెలుగు విద్యార్థుల క్రెడిట్ కార్డ్‌ మోసాలు.. కఠిన శిక్షలు తప్పవు

Indian Students : అమెరికాలో భారత విద్యార్థులు కొందరు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకు పోయారు. థియేటర్ల మేనేజ్మెంట్ల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు విచారణ చేపట్టగా క్రెడిట్ కార్డ్‌ ల ద్వారా అక్రమ లావాదేవీలు.. మోసపూరిత లావాదేవీలకు సంబంధించి కేసు నమోదు చేసి తెలుగు విద్యార్థులను అరెస్టు చేసినట్లుగా సమాచారం అందుతుంది.

గత సంవత్సరం నుండి మొదలుకొని మొన్నటి వరకు దాదాపుగా లక్షన్నర డాలర్ల క్రెడిట్ కార్డు మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డట్లుగా ఫిర్యాదులో థియేటర్ల యాజమాన్యాల వారు మరియు క్రెడిట్ కార్డ్‌ సంస్థల వారు పేర్కొన్నారు.

అమెరికాలో తెలుగు విద్యార్థుల అక్రమాలు…

విద్యార్థులు తమ క్రెడిట్ కార్డు ద్వారా సినిమా థియేటర్ ల టికెట్ల ను బుక్ చేసి.. ఆ తర్వాత తాము టికెట్లను బుక్ చేయలేదు, అక్రమంగా ఎవరో గుర్తు తెలియని వారు ఆ టికెట్లను బుక్ చేసుకున్నారు. కనుక తమకు డబ్బు ఇవ్వాల్సిందే అంటూ క్రెడిట్ కార్డు కంపెనీలను విద్యార్థులు అడగడం జరుగుతుంది.

అక్కడ నిబంధనల అనుసారంగా ఆ డబ్బు ని తిరిగి క్రెడిట్ కార్డు కంపెనీలు విద్యార్థులకు ఇవ్వడం జరిగిందట. ఇది చాలా కాలంగా జరుగుతుంది. దాంతో ఈ వ్యవహారం అంతా అమెరికా లోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది అని ఇటీవల క్లారిటీ వచ్చింది.

కేవలం సినిమా టికెట్ల విషయంలోనే కాకుండా షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ లో కూడా క్రెడిట్ కార్డ్ మోసపూరిత లావాదేవీలు కొనసాగాయని నివేదికలు అందుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగు విద్యార్థులు చాలా మంది అరెస్టయి కఠిన శిక్షలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us