Rohit Sharma: సిరాజ్‌కి మొట్టికాయ ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టిన చూసిన రాహుల్

Rohit Sharma: టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత భార‌త్ తో టీ20లు, టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం తొలి టీ20 జ‌ర‌గ‌గా, ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా డగౌట్‌లో కూర్చున్న టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ.. ఉన్నట్టుండి సహచర ఆటగాడైన మహమ్మద్ సిరాజ్‌ నెత్తి మీద ఒక్కటేసాడు.

Siraj Slapped by Rohit Sharma
Siraj Slapped by Rohit Sharma

ఏదో లోకంలో ఉంటూ బిత్తరపోయిన సిరాజ్‌ను.. కేఎల్ రాహుల్ మందలించగా అతను స్పందించలేదు. దాంతో అతని వెనుకాలనే ఉన్న రోహిత్.. అతని నెత్తి మీద ఒక్కటేసి అలర్ట్ చేశాడు. అయితే ఇదంతా టీవీ కెమెరాల్లో చిక్కుకోవడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం రాత్రి జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (48: 36 బంతుల్లో 5×4, 2×6), కేఎల్ రాహుల్ (15: 14 బంతుల్లో 1×4, 1×6) తొలి వికెట్‌కి 5.1 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మెరుపు ఆరంభాన్నిచ్చారు.

Siraj Slapped by Rohit Sharma1
Siraj Slapped by Rohit Sharma1

కానీ.. కీలక సమయంలో ఇద్దరూ ఔటైపోగా. డగౌట్‌లో పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ని వీక్షించిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో ఆడుకుంటూ కనిపించారు. మ్యాచ్ చివర్లో సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ పేలవరీతిలో వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్కంఠగా మారింది.

భారత్ జట్టు విజయానికి ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరమవగా.. భారత్ డగౌట్‌లో కాస్త టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ దశలో డగౌట్‌లోని టీవీ వైపు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చూస్తుండగా.. వారి పక్కనే కూర్చుని ఉన్న మహ్మద్ సిరాజ్ మాత్రం ఏదో పరధ్యానంలో కనిపించాడు. ఇప్పుడు సోషల్ మీడియా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఆఖరికి భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.