IAS : శానిటరీ పాడ్స్ గురించి అడిగితే.! ‘కండోమ్స్ కూడా ఫ్రీగా ఇవ్వాలా..’ అంటూ ఐఏఎస్ దురుసుతనం.!

NQ Staff - September 29, 2022 / 11:43 AM IST

IAS : శానిటరీ పాడ్స్ గురించి అడిగితే.! ‘కండోమ్స్ కూడా ఫ్రీగా ఇవ్వాలా..’ అంటూ ఐఏఎస్ దురుసుతనం.!

IAS : బీహార్‌లోని పాట్నాలో ఓ ఐఏఎస్ అధికారి అసహనంతో ఊగిపోయారు. అంతలా ఆ ఐఏఎస్ అధికారి అసహనంతో ఊగిపోవడానికి కారణం, బాలికలు శానిటరీ ప్యాడ్స్ అడగడమే. ఐఏఎస్ అధికారిణి హార్దోత్ కౌర్ భమ్రా తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

వివరాల్లోకి వెళితే, ‘అమమ్మాయిల గౌరవం పెంచడం’ అనే అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో బాలికలు తమ తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ అందించాలంటూ ఓ బాలిక తన అభిప్రాయం చెప్పడమే నేరం అయిపోయింది.

కండోమ్‌లు కూడా ఉచితంగా అడుగుతారేమో..

‘ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ అడుగుతున్నారు. రేపు ప్రభుత్వం జీన్స్ ఇవ్వాలని అడుగుతారు. ఆ తర్వాత అందమైన బూట్లు..’ అంటూ రెచ్చిపోయారు ఐఏఎస్ అధికారిణి. అక్కడితో ఆగకుండా, ‘రేపు పెళ్ళయ్యాక కుటుంబ నియంత్రణ కోసం కండోమ్‌లు కూడా ఉచితంగా ఇవ్వమని అడుగుతారు..’ అంటూ ఐఏఎస్ అధికారిణి వ్యాఖ్యానించేసరికి అంతా అవాక్కయ్యారు.

‘ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలి.. ప్రజల అవసరాలు తీర్చాలి. అదే ప్రభుత్వ బాధ్యత. ప్రజలు ఓట్లేస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడేది..’ అని ప్రశ్నిస్తే, ‘ఇది మూర్ఖపు ఆలోచన. అలాంటప్పుడు ఓట్లు వేయొద్దు. పాకిస్తాన్‌తో కలిసిపోండి..’ అంటూ ఐేెస్ అధికారిణి హర్దోత్ కౌర్ భ్రమా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాగా, ‘మేం భారతీయులం.. మేమెందుకు పాకిస్తాన్‌తో కలుస్తాం.?’ అంటూ విద్యార్థులంతా గట్టిగా నిలదీసే సరికి, ఆ ఐఏఎస్ అధికారి ఒకింత అసహనానికి గురయ్యారు. కాగా, అక్కడ జరిగిన విషయం వేరనీ, దాన్ని ఇంకో కోణంలో చూపిస్తూ, తనను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భమ్రా ఆరోపిస్తున్నారు. మహిళల హక్కుల కోసం సాధికారత కోసం తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానంటున్నారామె.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us