Sai Kumar: త‌ప్పిన పెద్ద ప్రమాదం.. జూలో సింహాలకి ద‌గ్గ‌ర‌గా వెళ్లిన సాయి కుమార్

Sai Kumar: కొంద‌రు కావాలని ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటూ ఉంటారు. ప్ర‌మాద‌క‌ర‌మైన జంతువుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి త్యాగాలు చేస్తూ ఉంటారు. తాజాగా హైద‌రాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌లో ఓ యువ‌కుడు పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు. సాయికుమార్‌ అనే యువకుడు ఆఫ్రికన్‌ జాతికి చెందిన సింహాలు ఉండే ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లాడు

saikumar-safe
saikumar-safe

సమీపంలోని బండ రాళ్లపై కూర్చున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూ పార్క్‌లోని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన సాయికుమార్‌ అక్కడ బండరాయిపై కూర్చొని ఉండగా సింహం కూడా అతని సమీపంలోకి వచ్చింది.

పొరపాటున అతను రాయిపై నుంచి జారిపడి ఉంటే సింహం దాడి చేసి ఉండేదని సందర్శకులు తెలిపారు. అక్కడి నుంచి బయటకు రావాలని సందర్శకులు కేకలు వేసినా ఆ యువకుడు పట్టించుకోలేదు. ఓ వైపు కేర్ టేకర్ కూడా సింహాం దృష్టి మరల్చేలా ప్రయత్నించాడు.

వెంటనే జూపార్క్‌ సిబ్బంది అప్రమత్తమై యువకుడిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. అతన్ని బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాయికుమార్‌కు మతి స్థిమితం లేదని గుర్తించారు. యువకుడిని కీసరకు చెందిన సాయి కుమార్​గా పోలీసులు గుర్తించారు.