Kohli: విరాట్ కోహ్లీ క‌న్నా పాక్‌లో ఎక్కువ క్రేజ్ సంపాదించిన భార‌త ఆట‌గాడు ఎవ‌రో తెలుసా?

Kohli: ఈ ఆదివారం పాకిస్తాన్‌- ఇండియా మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు దేశాలు అంత‌ర్జాతీయ సిరీస్‌లోనే త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్​ కోసం ఇరు దేశాల క్రికెట్​ అభిమానులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్​ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

rohit more fan following than kohli
rohit more fan following than kohli

గత కొన్నేళ్లుగా వన్డే, టీ20 వరల్డ్​ కప్​లలో ఏదైనా పాకిస్తాన్​పై టీమ్ఇండియా ఎక్కువ సార్లు ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలో టీ20 వరల్డ్​ కప్​లో భాగంగా ఆదివారం (అక్టోబరు 24) జరగనున్న మ్యాచ్​లో మరోసారి పాక్​ జట్టుపై ఇండియా జట్టు విజయం సాధిస్తుందా? అని టీమ్ఇండియా ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ

రెండు దేశాల్లోనూ ఆయా క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉదాహరణకు పాక్ లో సచిన్ కు బోలెడు మంది ఫ్యాన్స్ ఉంటే.. మన భారత్ లో షాహిద్ అఫ్రిది కూడా అభిమాన గణం ఉంది. ఇక ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కోహ్లీకి కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 160 మిలియన్లకు ఫాలోవర్లను సొంతం చేసుకున్న కోహ్లీ, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీల్లో ఒకడు. ఇక, క్రికెటర్లలో ఎవ్వరూ కూడా కోహ్లీ దరిదాపుల్లో లేరు. అయితే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కంటే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కు పాకిస్తాన్‌లో ఫాలోయింగ్ ఎక్కువని అంటున్నాడు పాక్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.

rohit more fan following than kohli1
rohit more fan following than kohli1

పాకిస్తాన్‌లో కూడా టీమిండియా క్రికెటర్లకు అభిమానులున్నారు. మా దేశంలో విరాట్ కోహ్లీ ఆటను, బుమ్రా, షమీ బౌలింగ్‌ను ఎంతగానో ఇష్టపడతారు. అయితే, విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మకు ఫాలోయింగ్ ఎక్కువ. రోహిత్‌ను మా దేశంలో ” ఇండియాకా ఇంజమామ్ ” అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.” అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్.

షోయబ్ అక్తర్ కామెంట్లతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.కాగా, టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.2007 వరల్డ్ కప్ బౌలౌట్‌తో మొదలైన భారత్ విజయ ప్రస్థానం గత 2016 టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగింది.