Whatsapp : వాట్సప్ కి ప్రత్యామ్నాయం చూసుకుంటున్న జనాలు
NQ Staff - October 26, 2022 / 09:39 AM IST

Whatsapp : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్న వాట్స్అప్ నిన్న రెండు గంటల పాటు స్థంభించి పోయిన విషయం తెలిసిందే. మొదట గ్రూప్స్ లో మెసేజ్ లు వెళ్లలేదు, ఆ తర్వాత ఆడియో కాల్స్ మరియు వీడియో కాల్స్ రద్దు అయ్యాయి. ఆ తర్వాత మొత్తానికి వాట్స్అప్ డౌన్ అయింది.
రెండు గంటలకు పైగా ప్రపంచ వ్యాప్తంగా వాట్స్అప్ వినియోగదారులు కింద మీద పడ్డారు. ముఖ్యంగా ఇండియాలో 55 కోట్ల వినియోగదారులున్న వాట్సాప్ పనిచేయక పోవడంతో ఎక్కడికక్కడ పనులు స్తంభించిపోయినట్లుగా అనిపించింది.
వాట్సాప్ వినియోగిస్తున్న వారు వెంటనే మరో మెసెంజర్ యాప్ కి మారలేక పోయారు. వాట్సప్ వస్తుందేమో అంటూ చాలా సమయం పాటు వెయిట్ చేశారు. కొందరు తమ వద్దనే సమస్య ఉందేమో అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వాట్సాప్ తీసి మళ్లీ వేయడం వంటి పనులు చేశారు.
గతంలో కూడా వాట్సాప్ ఇలాగే సమస్య పెట్టింది. ముందు ముందు కూడా వాట్సాప్ నుండి ఇలాంటి టెక్నికల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే వాట్సప్ కి ప్రత్యామ్నాయ మెసెంజర్ యాప్ నీ వెతుక్కోని పనిలో వినియోగ వినియోగదారులు పడ్డారు. ఇప్పటికే కొందరు టెలిగ్రామ్ ని ఆశ్రయించగా కొందరు సిగ్నల్ ని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వాట్స్అప్ మరో సారి నిన్నటి తరహాలో డౌన్ అయితే ఇక పూర్తిగా డౌన్ అవ్వాల్సిందే అంటూ టెక్ నిపుణులు చెబుతున్నారు.