Trending : భార్యను గర్భవతిని చేసేందుకు.! 15 రోజులు పెరోల్ పొందిన ‘రేప్’ కేసు దోషి.!
NQ Staff - October 16, 2022 / 04:48 PM IST

Trending : అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది రాజస్థాన్ హైకోర్టు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అత్యంత ముఖ్యమైన సందర్భాల్లోనే, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఖైదీలకు పెరోల్ లభిస్తుంటుంది.
అయితే, అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి పెరోల్ ఎందుకు లభించిందో తెలుసా.? విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అతను తన భార్యని గర్భవతిని చేసేందుకు పెరోల్ పొందాడు.
రాహుల్ అనే వ్యక్తికి అత్యాచారం కేసులో 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. భార్యని గర్భవతిని చేసేందుకు.. రాహుల్ భార్య తాను గర్భవతిని కావాలనుకుంటున్నాననీ, ఈ క్రమంలో తన భర్తను పెరోల్ మీద విడుదల చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. వాదోపవాదాల నేపథ్యంలో ‘దోషి భార్య తల్లి కావాలని కోరుకుంటోంది. తన భర్త లేకుండా, తన భర్త నుంచి ఎలాంటి పిల్లలు కలగకుండా వుండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదు.
ముఖ్యంగా ఆమె తన వంశ పరిరక్షణ కోసం పిటిషన్ దాఖలు చేసింది.. పిటిషన్‌ని తిరస్కరిస్తే ఆమె హక్కుల్ని నిరాకరించినట్లు అవుతుంది..’ అంటూ న్యాయస్థానం పెరోల్ మంజూరు చేస్తూ వ్యాఖ్యానించింది. గతంలోనూ రాజస్థాన్ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇంకోటి ఇచ్చింది. అమాయకురాలైన భార్య వైవాహిక జీవితం, ఆమె భర్త దుశ్చర్య కారణంగా ప్రభావితం కాకూడదనీ, ఏ మహిళ అయినా తల్లి అయినప్పుడే పరిపూర్ణ జీవితం పొందినట్లు అవుతుందని న్యాయస్థానం అప్పట్లో వ్యాఖ్యానించింది.