Pawan Kalyan: మాస్క్ త‌ల‌కి ధ‌రించిన ప‌వ‌న్ కూతురు.. సారీ మ‌మ్మీ అంటూ పోస్ట్‌

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రేణూ దేశాయ్ ముద్దుల కూతురు ఆద్య నెటిజ‌న్స్‌తో పాటు మెగా అభిమానుల‌కి సుప‌రిచితం. ఈ చిన్నారి పాప ఫొటో ఏదైన బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే దానిని సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తుంటారు నెటిజ‌న్స్. ఇటీవ‌ల ఓ టీవీ షోకు గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌గా, ఆ స‌మ‌యంలో ఆద్య‌కి సంబంధించిన పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి.

Aadhya
Aadhya

ఇక తాజాగా ఆద్య అల్ల‌రి ప‌నుల‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ముఖానికి పెట్టుకోవ‌ల్సిన మాస్క్ త‌ల‌కు ధ‌రించి డిఫ‌రెంట్ లుక్‌లో ఆద్య చూస్తుండ‌గా, ఆ ఫొటోల‌ని త‌న కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది రేణూదేశాయ్.

అయితే ఆ పోస్ట్‌కి ఆద్య .. ”అరే.. మాస్క్ తలపై ఉందే. సారీ మమ్మీ.. ఇక నుంచి సరిగ్గా ధరిస్తాను.” అని ఆద్య చెబుతున్నట్లుగా ఇన్‌స్టగ్రామ్‌లో సరదాగా పోస్ట్ చేశారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు సెకండ్ వేవ్ స‌మ‌యంలో అనేక సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.

Renu Desai
Renu Desai

రేణూదేశాయ్ ప్ర‌స్తుతం ప‌లు షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాన‌ని అంటుంది. అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న రేణూ దేశాయ్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పోస్ట్ ల ద్వారా సోష‌ల్ మీడియాలలో అల‌రిస్తూ ఉంటుంది.

ఇక ఆద్య తండ్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యానికి వ‌స్తే, వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు,అయ్య‌ప్ప‌నుమ్ కోషియమ్ రీమేక్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల‌ను వచ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు.